కొత్తగా పెళ్లయిన వారికి అరుంధతి నక్షత్రాన్ని ఎందుకు చూపిస్తారు?

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహం కార్యక్రమం జరిగేటప్పుడు ఎన్నో పద్దతులను, ఆచారాలను పాటిస్తారు. అలా ప్రతి సంప్రదాయం వెనుకా ఒక అర్థం, పరమార్థం దాగి ఉంటుంది.ఇందులో భాగంగానే పెళ్లయిన నవదంపతులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపించడం మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఈ అరుంధతి ఎవరు? పెళ్లయిన దంపతులకు అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి గల కారణం ఏమిటి? అనే సందేహం అందరికీ కలుగుతుంది. అయితే అరుంధతి నక్షత్రం చూపించడానికి గల కారణం ఏమిటంటే ఇక్కడ తెలుసుకుందాం.. Also […]

Written By: Navya, Updated On : December 31, 2020 11:34 am
Follow us on

మన హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహం కార్యక్రమం జరిగేటప్పుడు ఎన్నో పద్దతులను, ఆచారాలను పాటిస్తారు. అలా ప్రతి సంప్రదాయం వెనుకా ఒక అర్థం, పరమార్థం దాగి ఉంటుంది.ఇందులో భాగంగానే పెళ్లయిన నవదంపతులకు అరుంధతీ నక్షత్రాన్ని చూపించడం మనం గమనిస్తూనే ఉంటాం. అయితే ఈ అరుంధతి ఎవరు? పెళ్లయిన దంపతులకు అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి గల కారణం ఏమిటి? అనే సందేహం అందరికీ కలుగుతుంది. అయితే అరుంధతి నక్షత్రం చూపించడానికి గల కారణం ఏమిటంటే ఇక్కడ తెలుసుకుందాం..

Also Read: మహిళలకు శుభవార్త.. తక్కువ వడ్డీకే ప్రత్యేక స్కీమ్స్ తో సులభంగా రుణాలు..?

కొత్తగా పెళ్లైన జంటకు ఆకాశంలో సప్తర్షి మండలంలో ఉన్న వశిష్టుని తారకు ప్రక్కనే మండుతున్న అరుంధతి నక్షత్రాన్ని చూపించి దర్శనం చేసుకోమని చెబుతారు. అనంతరం అరుంధతి నక్షత్రానికి పూజ నిర్వహించి ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ విధంగా ఆ దంపతులకు అరుంధతి నక్షత్రాన్ని చూపించడానికి ఒక ప్రధాన కారణం ఉంది. అదేమిటంటే..

Also Read: రైతంటే భూమి ఉన్నోడా.. పంట పండించేటోడా?

వశిష్ట, అరుంధతి అనే ఇద్దరు భార్యాభర్తలు. వీరిద్దరు పురాణాలలోని ఆదర్శ దంపతులుగా పేరు ప్రఖ్యాతులు గాంచారు. కొత్తగా పెళ్లయిన దంపతులు కూడా వారి మాదిరి ఆదర్శంగా ఉండాలనే ఉద్దేశంతోనే మనవారు పెళ్లిలో అరుంధతి నక్షత్రాన్ని చూపించడం ఒక ఆచారంగా పెట్టుకున్నారు. బ్రహ్మదేవుడు సృష్టి కార్యంలో తనకు సహాయంగా ఉండేందుకు ఒక అందమైన కన్యను సృష్టిస్తాడు. ఆ కన్య పేరే సంధ్య. తరువాత ఈ సంధ్య అరుంధతి గా మారుతుంది. సంస్కృతం భాషలో ఆరుం అంటే అగ్ని, ధతీ అంటే ధరించినదని అర్థం. అందువల్ల అరుంధతి నక్షత్రం ఎల్లప్పుడు కాంతులతో వెలుగుతూ ఉంటుంది.

మరిన్ని వార్తల కోసం: ప్రత్యేకం