ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి చెందిన సంఘటన రంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. జిల్లాలోని కొత్తూరు మండలం తిమ్మాపూర్ ఎక్స్ రోడ్డు వద్ద శనివారం ఓ ట్యాంకర్ ను కారు ఢీకొట్టింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడమే మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతహాలను సమీప ఆసుపత్రికి తరలించారు. అనంతరం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మృతుల్లో తండ్రీ కొడుకులు కల్యాణ చక్రవర్తి, సత్యనారాయణలుగా గుర్తించారు. వీరు తిరుపతికి వెళ్లి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు.