https://oktelugu.com/

ఉద్యోగాల భర్తీలో స్పీడు పెంచిన తెలంగాణసర్కార్.. ఖాళీలు ఎన్నంటే?

దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిరుద్యోగులు, యువత మొత్తం బీజేపీ వైపు మరలి పెద్ద ఎత్తున ఓట్లు వేయించడంతో సీఎం కేసీఆర్ సర్కార్ అలెర్ట్ అయ్యింది. జీహెచ్ఎంసీ ఫలితం రాగానే సమీక్షించుకున్న యువతను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఒకేసారి ఏకంగా 50 వేల ఉద్యోగాల ప్రకటన చేయడం విశేషం. Also Read: వైరల్ వీడియో: ఎంఐఎం నేత కాల్పులు.. ముగ్గురు సీరియస్ అయితే అలా కేసీఆర్ చాలా ప్రకటించారు. కానీ వాటిని అమలు చేయలేదు. దీనిపై […]

Written By:
  • NARESH
  • , Updated On : December 19, 2020 7:41 pm
    Follow us on

    KCR

    దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో నిరుద్యోగులు, యువత మొత్తం బీజేపీ వైపు మరలి పెద్ద ఎత్తున ఓట్లు వేయించడంతో సీఎం కేసీఆర్ సర్కార్ అలెర్ట్ అయ్యింది. జీహెచ్ఎంసీ ఫలితం రాగానే సమీక్షించుకున్న యువతను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈ క్రమంలోనే ఒకేసారి ఏకంగా 50 వేల ఉద్యోగాల ప్రకటన చేయడం విశేషం.

    Also Read: వైరల్ వీడియో: ఎంఐఎం నేత కాల్పులు.. ముగ్గురు సీరియస్

    అయితే అలా కేసీఆర్ చాలా ప్రకటించారు. కానీ వాటిని అమలు చేయలేదు. దీనిపై ఆరేళ్లుగా ఎన్నో విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్లక్ష్యం, నిర్లిప్తతపై నిరుద్యోగులు భగ్గుమన్నారు. తాజాగా టీఎస్పీఎస్సీ చైర్మన్ గంటా చక్రపాణి ఆరేళ్ల పదవీకాలం కూడా ముగియడంతో దాన్ని తాత్కాలికంగా వేరే వారికి కేసీఆర్ అప్పగించారు.

    ఈ క్రమంలోనే శాఖాపరమైన నియామకాలకే కేసీఆర్ ప్రాధాన్యం ఇస్తున్నారు. టీఎస్పీఎస్సీని పరిమితం చేయాలని.. దాని ద్వారా తక్కువ నియామకాలు చేయాలని డిసైడ్ అయ్యారు.

    తాజాగా కేసీఆర్ ఆదేశాల మేరకు ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో తెలంగాణ సర్కార్ స్పీడు పెంచింది. ఇందులో భాగంగానే శాఖల వారీగా ఖాళీగా ఉన్న ఉద్యోగాల వివరాలను సీఎస్ సోమేష్ కుమార్ సేకరించారు. ఈ మేరకు ఆయా శాఖల విభాగాధిపతులతో సీఎస్ వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.

    Also Read: వైరల్ వీడియో: ఎంఐఎం నేత కాల్పులు.. ముగ్గురు సీరియస్

    తాజాగా బీఆర్కే భవన్ లో విద్య, ఆరోగ్య శాఖల అధికారులతో రాష్ట్ర సీఎస్ సోమేష్ సమావేశమయ్యారు. మొత్తం ఎన్ని ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి? వాటి నియామకం వల్ల ప్రభుత్వం పై పడే ఆర్థిక భారం తదితర వివరాలు తెలుసుకున్నారు.

    దాదాపు 50వేలకు పైగా ఖాళీలు ఉన్నాయని గుర్తించిన సీఎస్ ఈ ఉద్యోగాల భర్తీకి సోమవారం కీలక ఉత్తర్వులు ఇవ్వడానికి రెడీ అయినట్టు సమాచారం.

    ఇక వీటి తర్వాత జనవరి, ఫిబ్రవరిలో ఎమ్మెల్సీ, నాగార్జున సాగర్ ఎన్నికలు ముగిశాక పోలీస్ ఉద్యోగాల ప్రకటనకు సర్కార్ రెడీ అవుతోంది. దాదాపు 20వేల పోలీస్ ఉద్యోగాల పోస్టులను భర్తీ చేస్తామని పోలీస్ ఉన్నతాధికారులు తెలిపారు.

    ఈ మొత్తం దాదాపు 70వేలకు పైగా ఉద్యోగాలు కావడంతో నిరుద్యోగులు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. ఉద్యోగాల కోసం ప్రిపరేషన్ మొదలు పెట్టారు.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్