https://oktelugu.com/

అంటువ్యాధులు ప్రబలే అవకాశం : మంత్రి ఈటల

రాష్ట్రంలో కరోనా వ్యాప్తి తగ్గినా భారీ వర్షాలతో అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ సూచించారు. మంగళవారం ఆయన వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అంటువ్యాధులు ప్రబలే అవకాశాలున్నాయన్నారు. ప్రజలెవరూ నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. జలుబు, జ్వరంతో బాధపడేవారు ఆసుపత్రికి వెళ్లాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పంచాయతీరాజ్‌శాఖ, పురపాలక శాఖలతో కలిసి వైద్య సిబ్బంది పనిచేయాలన్నారు.

Written By: , Updated On : October 20, 2020 / 10:42 AM IST
Follow us on