దుబ్బాకలో ఇప్పటి వరకు సాగిన కౌంటింగ్లో బీజేపీ లీడ్ గానే ఉంటోంది. మొదటి రౌండ్లో 841 ఓట్లతో, రెండో రౌండ్లో 279 ఓట్లు రాగా మూడో రౌండ్ లో 1259, నాలుగో రౌండ్లో 1,425 ఓట్ల ఆధిక్యత వచ్చింది. నాలురో రౌండ్ పూర్తయ్యే సరికి మొత్తం 2,684 ఓట్లతో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ముందజలో ఉన్నారు. ఇందులో బీజేపీకి 13,055, టీఆర్ఎస్ కు 10,371, కాంగ్రెస్ 2,158 ఓట్లు వచ్చాయి. ఇప్పటి వరకు దుబ్బాక , మిరుదొడ్డి మండలాల ఓట్లు లెక్కింపు పూర్తయ్యాయి. అయితే మొదటి, రెండు రౌండ్లతో పోలిస్తే రెండో రౌండ్లో ఆధిక్యత తగ్గింది. పోస్టల్ బ్యాలెట్లో టీఆర్ఎస్ ఆధిక్యం సాధించింది. దీంతో బీజేపీకి ఆశలు సన్నగిల్లాయి. కానీ ఈవీఎం ఓట్లను లెక్కించేసరికి పరిస్థతి మారిపోయింది. రెండో రౌండ్ లోనూ బీజేపీ ఆధిక్యత కొనసాగడం గమనార్హం.