https://oktelugu.com/

ఐదు రోజుల దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా?

సాధారణంగా కొంతమంది నరక చతుర్దశి, దీపావళిని రెండు రోజులుపాటు జరుపుకుంటారని అందరికీ తెలిసినదే కానీ, దీపావళి పండుగను ఐదురోజుల పాటు నిర్వహిస్తారు. ఆశ్వీజ బహుళ త్రయోదశి నుంచి…. భగినీహస్త భోజనం వరకు ఐదు రోజులపాటు ఈ పండుగను జరుపుకుంటారు. ఆశ్వీజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశి అని కూడా పిలుస్తారు.ఈ ధన త్రయోదశి నుంచి దీపావళి పండుగ మొదలవుతుంది. Also Read: ఈ దీపం 24 గంటలు వెలుగుతుంది.. ఎలానో తెలుసా? ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి రోజున […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 10, 2020 / 10:50 AM IST
    Follow us on

    సాధారణంగా కొంతమంది నరక చతుర్దశి, దీపావళిని రెండు రోజులుపాటు జరుపుకుంటారని అందరికీ తెలిసినదే కానీ, దీపావళి పండుగను ఐదురోజుల పాటు నిర్వహిస్తారు. ఆశ్వీజ బహుళ త్రయోదశి నుంచి…. భగినీహస్త భోజనం వరకు ఐదు రోజులపాటు ఈ పండుగను జరుపుకుంటారు. ఆశ్వీజ బహుళ త్రయోదశిని ధన త్రయోదశి అని కూడా పిలుస్తారు.ఈ ధన త్రయోదశి నుంచి దీపావళి పండుగ మొదలవుతుంది.

    Also Read: ఈ దీపం 24 గంటలు వెలుగుతుంది.. ఎలానో తెలుసా?

    ఆశ్వయుజ శుద్ధ త్రయోదశి రోజున మన ఇంటిని శుభ్రం చేసి లక్ష్మీదేవికి ఎంతో ఘనంగా పూజలు నిర్వహిస్తారు. మన ఇంట్లో ఉన్న వెండి, బంగారు ఆభరణాలతో శ్రీ మహాలక్ష్మిని పూజించడం వల్ల అష్టైశ్వర్యాలు చేకూరుతాయని ప్రగాఢ విశ్వాసం. అందుకే ధన త్రయోదశి రోజున శ్రీ మహాలక్ష్మికి, కుబేరునికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఈరోజు కేవలం బంగారు నగలు మాత్రమే కాకుండా ఏ వస్తువులు కొన్న శుభం కలుగుతుందని భావిస్తారు. క్షీరసాగర మధనం చేసినప్పుడు ఆశ్వీయుజ త్రయోదశి రోజున సాక్షాత్తు ఆ మహాలక్ష్మి సముద్ర గర్భం నుంచి ఉద్భవించి ఉందని ఈ రోజున ధన త్రయోదశి గా జరుపుకుంటారు. అలాగే ధన త్రయోదశి రోజున ధన్వంతరి మాతను కూడా పూజించడంవల్ల ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేకుండా ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉంటారని ఆ రోజున ధన్వంతరీ మాతను పూజిస్తారు.

    దీపావళికి ముందు రోజున నరక చతుర్దశి గా జరుపుకుంటారు. ఈరోజు ఉదయం స్నానమాచరించి నరకాసురుడి బొమ్మను తయారుచేసి దహనం చేస్తారు. కొన్ని ప్రాంతాలలో ఆడపడుచులు పుట్టింటికి వచ్చి అన్నదమ్ములకు నువ్వుల నూనెతో తలంటి హారతి ఇస్తారు.అంతేకాకుండా,ఇంటి ఆడపడుచు విలువైన బహుమతులు ఇచ్చి గౌరవిస్తారు.

    ఆశ్వీయుజ మాసం అమావాస్య రోజున దీపావళి పండుగను జరుపుకుంటారు. సాధారణంగా అమావాస్య రోజున సాయంత్రం అమావాస్య ఘడియలు ఉన్న సమయంలో లక్ష్మీదేవిని ఎంతో భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. హిందువులు అమావాస్య రోజున భాద్రపద బహుళ అమావాస్య రోజున మహాలయ అమావాస్యను, ఆశ్వీజ మాసం బహుళ అమావాస్య రోజన దీపావళి పండుగను జరుపుకుంటారు. కేవలం ఈ రెండు పండుగలు మాత్రమే అమావాస్య రోజులు జరుపుకుంటారు.ఈ పండుగ రోజున మట్టి ప్రమిదలలో నువ్వుల నూనెతో దీపాలు వెలిగించడం ద్వారా ఆ లక్ష్మీ మాత అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలను ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం.

    Also Read: కార్తీక మాసమంతా దీపాలు ఎందుకు వెలిగిస్తారో తెలుసా?

    దీపావళికి మరునాడు జరుపుకునే ఈ పండుగను బలి పాడ్యమి అంటారు. పురాణాల ప్రకారం చతుర్దశి రోజునవిష్ణుమూర్తి అవతారంలో వచ్చి బలిచక్రవర్తిని పాతాళానికి తొక్కేస్తాడు. తరువాత బలిచక్రవర్తి తిరిగి భూమి మీదకు పాడ్యమి రోజున రావడం వల్ల ఈ రోజున బలి పాడ్యమి అని జరుపుకుంటారు. గుజరాతీయులు ఈ రోజున ఉగాది పండుగగ జరుపుకుంటారు.

    భగినీ హస్త భోజనం ఈ రోజున యముడు తన చెల్లెలు అయినా యమి ఇంటికి భోజనానికి వెళ్తాడు. తన అన్న తన ఇంటికి రావడంతో ఎంతో ఆనంద పడిన ఏమి యమునికి నువ్వుల నూనెతో తలంటి స్నానం చేయించి వివిధ రకాల భోజనాలను తన చేతితో వడ్డించి యముని ఆనందింప చేస్తుంది.తన చెల్లెలు భోజనం తో సంతృప్తి చెందిన యముడుఈరోజు ఎవరైతే తన సోదరి ఇంటికి భోజనానికి వెళ్తారో వారికి శని బాధలు ఉండవని తెలియజేస్తాడు. అంతేకాకుండా ఆ సంతోషంలో యమీ కి ఏదైనా వరం అడగమని చెప్పగా, ప్రతి సంవత్సరం ఈ రోజున తన ఇంటికి భోజనానికి రావలసిందిగా తన చెల్లెలు కోరుతుంది. ఈ విధంగా దీపావళి పండుగను ఐదురోజుల పాటు ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.