దీపావళి పండుగ అంటేనే ప్రతి ఒక్కరు వారి ఇంటిని దీపాలతో ఎంతో అందంగా అలంకరిస్తుంటారు. ఆ దీపాల వెలుగులలో మన ఇల్లు ఎంతో అందంగా కనిపిస్తూ కనువిందు చేస్తుంటుంది. కానీ ఈ దీపాలు వెలిగించడం లో కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. దీపాలను పేర్చి వాటిని వెలిగించి సమయంలో కొన్ని వెలిగించేలోపు మరికొన్ని ఆరిపోతూ ఉండటం వల్ల వాటిని వెలిగించడానికి ఎంతో ఇబ్బంది పడుతుంటారు. ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చత్తీస్ గఢ్ చెందిన చక్రధరి అనే వ్యక్తి “మ్యాజిక్ లాంప్” ను తయారుచేసి ఏ ఇబ్బంది లేకుండా ఆదీపం 24 గంటల నుంచి 40 గంటల వరకు వెలిగేలా తీర్చి దిద్దాడు.
Also Read: ఐదు రోజుల దీపావళి పండుగను ఎలా జరుపుకుంటారో మీకు తెలుసా?
గత ముందు సంవత్సరాలలో దీపావళి అంటే ఎంతో ఆనందంగా, దీపాలను వెలిగించి టపాకాయలు కాలుస్తూ ఎంతో ఆనందంగా జరుపుకునే వారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి టపాకాయలను కాల్చడానికి కొన్ని ప్రభుత్వాలు అనుమతి ఇవ్వడం లేదు. అయితే కేవలం దీపాలను వెలిగించి పూజలు జరుపుకోవాలని చూచించారు.
ఈ తరుణంలోనే చత్తీస్ ఘడ్ వాసి అయిన చక్రధరి అనే కుండలు తయారు చేసే వ్యాపారి భిన్నంగా ఆలోచించి ఈ మ్యాజిక్ లాంప్ తయారు చేశారు.ఈ మ్యాజిక్ లాంప్ ఎటువంటి ఆటంకం లేకుండా ఎక్కువ సమయం వెలుగుతూ కాంతులు వెదజల్లుతుందని తెలియజేశాడు. ఈ మ్యాజిక్ లాంప్ లో వత్తిని వెలిగించే దీపం పైన చిన్న పాటీ కుండను అమర్చాడు. అందులో నుంచి చిన్న రంధ్రం ద్వారా నూనె కింద ఉన్న దీపంలోకి పడుతుంది. ఈ దీపం నూనెతో నిండుగానే ఆ కుండలో నూనె దానికదే ఆగిపోతుంది. దీనివల్ల దీపం ఆరిపోకుండా నిరంతరం ఏ సమస్య లేకుండా వెలుగుతూ ఉంటుంది.
Also Read: కార్తీక మాసమంతా దీపాలు ఎందుకు వెలిగిస్తారో తెలుసా?
అయితే ప్రస్తుతం చక్రధరితయారుచేసిన ఈ మ్యాజిక్ లాంప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఈ దీపం పనిచేసే విధానాన్ని వీడియో రూపంలో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా ఎంతో మందిని ఆకట్టుకుంది. వివిధ రకాల టెక్నిక్ లను చూచి ఈ మ్యాజిక్ ల్యాంప్ ను తయారు చేసినట్లు అశోక చక్రధరి ఈ సందర్భంగా తెలిపారు.