రాజశేఖర్ పరిస్థితి నిలకడగా ఉందని ఆయన సతీమణి జీవిత వెల్లడించారు. ఈరోజు ఉదయం నుంచి మీడియాలో వస్తున్న వార్తలపై ఆమె విచారం వ్యక్తం చేశారు. తన భర్త ఆరోగ్యంపై వస్తున్న వార్తలు బాధిస్తున్నాయన్నారు. ఈ విషయంలో వదంతులు నమ్మొద్దని తెలిపారు. మరోవైపు రాజశేఖర్ ప్రస్తుతం సిటీ సెంటర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.ఆయన ఆరోగ్య పరిస్థితి వివరిస్తూ ఆసుపత్రి వర్గం బెలిటెన్ విడుదల చేసింది. రాజశేఖర్ ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, వెంటిలేటర్ సపోర్టు లేకుండా చికిత్స చేస్తున్నట్లు తెలిపారు.