https://oktelugu.com/

అవమానంగా ఫీలవుతున్న ఏపీ కాంగ్రెస్ మహిళా నేతలు..!

రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా అధ్వాన స్థితికి చేరింది. రాష్ట్రవిభజనకు కాంగ్రెస్సే కారణమంటూ 2014 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఆ పార్టీని ఓడించారు. అయితే తాము విభజనకు వ్యతిరేకంగా ఉన్నామని ఎంత చెప్పినా వినలేదు. దీంతో అటు ఇటుగా ఉన్న చంద్రబాబు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో ఏపీ కాంగ్రెస్ కీలక నాయకులను కోల్పోయి ధీనావస్థలోకి చేరింది. ఉన్న కొద్ది నాయకులతో అప్పటి […]

Written By:
  • NARESH
  • , Updated On : November 11, 2020 / 12:29 PM IST
    Follow us on

    రాష్ట్ర విభజన తరువాత ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి పూర్తిగా అధ్వాన స్థితికి చేరింది. రాష్ట్రవిభజనకు కాంగ్రెస్సే కారణమంటూ 2014 ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఆ పార్టీని ఓడించారు. అయితే తాము విభజనకు వ్యతిరేకంగా ఉన్నామని ఎంత చెప్పినా వినలేదు. దీంతో అటు ఇటుగా ఉన్న చంద్రబాబు అధికారంలోకి రాగానే కాంగ్రెస్ పార్టీ నుంచి కొందరు టీడీపీలోకి జంప్ అయ్యారు. దీంతో ఏపీ కాంగ్రెస్ కీలక నాయకులను కోల్పోయి ధీనావస్థలోకి చేరింది. ఉన్న కొద్ది నాయకులతో అప్పటి ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి ఆధ్వర్యంలో 2019 ఎన్నికల్లో బరిలో దిగగా ఒక్క సీటును కూడా గెల్చుకోలేకపోయింది. దీంతో ఇక కాంగ్రెస్ పార్టీలో ఉండడం వేస్టంటూ ద్వీతీయ శ్రేణి నాయకులు సైతం కాంగ్రెస్ జెండాను విడిచిపెట్టారు.

    Also Read: ఏపీలోనూ బీజేపీ బలపడనుందా.?

    ప్రస్తుతం పార్టీలో ఉన్న కొద్దిమంది నాయకులు అప్పుడప్పుుడు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అయితే ఇతర పార్టీల నుంచి వచ్చే విమర్శలను తిప్పికొట్టే వాళ్లు ఎవరూ కాంగ్రెస్లో లేకపోవడంతో ఉన్నవారు సైతం నిరాశ చెందుతున్నారు. ఇటీవల జరిగిన అమరావతి ఉద్యమంలో కొందరు మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు. అయితే వీరిపై బీజేపీ నాయకులు రూ.50 వేల చీరలతో ఉద్యమంలో పాల్గొన్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలపై పీసీపీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్ సైతం ఏవిధంగా స్పందించలేదు. దీంతో పార్టీలోని వారు అవమానంగా ఫీలవుతున్నారు.

    Also Read: ఏపీలో సోము వీర్రాజు కూడా మొదలుపెట్టేశాడట!

    మరో విషయమేంటంటే పార్టీలో కొందరు కాంగ్రెస్ నుంచి ఇతర పార్టీలోకి వెళ్లిన వారు సైతం నిరాశతో ఉన్నారు. కనీసం వారిని తిరిగి తెప్పించుకునేందుకు పార్టీ ఎలాంటి కార్యాచరణ చేయడం లేదు. అయితే నెలకోసారి సమావేశం నిర్వహించి పార్టీ పటిష్టతకు పాటుపడుతామని, పూర్వ వైభవం తీసుకొస్తామని అంటున్నారు. దీంతో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టకుండా పూర్వ వైభవం ఎలా తీసుకొస్తారని విమర్శిస్తున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    తెలంగాణ బార్డల్ ఉన్న గుంటూరు, ఉభయగోదావరి జిల్లాల నుంచి కొందరు కీలక నేతలు పార్టీని వీడారు. అయితే ఈ జిల్లాల్లో సరైన నాయకులను నియమించడం లేదు. దీంతో కిందిస్థాయి నాయకుులు సైతం తాము కాంగ్రెస్ పార్టీలో ఉన్నామని చెప్పుకునేందుుకు భయపడుతున్నారు. మరి ఇప్పటికైనా పార్టీ నాయకులు పార్టీ పటిష్టతకు ఎలాంటి ప్రణాళికలు చేపడుతారో చూడాలి.