అలాంటి కేసులే ఎక్కువగా ఉన్నాయి: సీపీ సజ్జనార్‌

తల్లిదండ్రులతో మైనర్లు గొడవపడి ఇంటినుంచి వెళ్లిపోతున్న కేసులే ఎక్కువగా ఉన్నాయని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. సోషల్‌ మీడియా కారణంగా చిన్న పిల్లలు ఎక్కువగా వాటిపై ఆధారపడి మానసికంగా కుంగిపోతున్నారన్నారు. దీంతో చిన్న విషయానికే వారు ఇళ్లు విడిచి వెళ్తున్నారన్నారు. శుక్రవారం ఆయన మిస్సింగ్‌ కేసులపై ప్రెస్‌మీట్‌ పెట్టారు. రోజురోజుకు పెరుగుతున్న మిస్సింగ్‌ కేసులపై ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. ప్రతీ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని పరిష్కరిస్తున్నామన్నారు. వ్యక్తిగత, మనస్పర్థల వల్ల కూడా కొంతమంది ఇంటినుంచి వెళుతున్నారని […]

Written By: Suresh, Updated On : November 6, 2020 3:31 pm
Follow us on

తల్లిదండ్రులతో మైనర్లు గొడవపడి ఇంటినుంచి వెళ్లిపోతున్న కేసులే ఎక్కువగా ఉన్నాయని సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ సజ్జనార్‌ తెలిపారు. సోషల్‌ మీడియా కారణంగా చిన్న పిల్లలు ఎక్కువగా వాటిపై ఆధారపడి మానసికంగా కుంగిపోతున్నారన్నారు. దీంతో చిన్న విషయానికే వారు ఇళ్లు విడిచి వెళ్తున్నారన్నారు. శుక్రవారం ఆయన మిస్సింగ్‌ కేసులపై ప్రెస్‌మీట్‌ పెట్టారు. రోజురోజుకు పెరుగుతున్న మిస్సింగ్‌ కేసులపై ఎక్కువ దృష్టి పెట్టామన్నారు. ప్రతీ కేసును ఛాలెంజ్‌గా తీసుకొని పరిష్కరిస్తున్నామన్నారు. వ్యక్తిగత, మనస్పర్థల వల్ల కూడా కొంతమంది ఇంటినుంచి వెళుతున్నారని సీపీ తెలిపారు. భార్యభర్తల గొడవలతో కూడా కొందరు భార్య, లేదా భర్త ఇంటి నుంచి వెళ్లి తిరిగి రావడం లేదన్నారు.