కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కరోనా పాజిటివ్ నిర్దారణ అయింది. అయనకు స్వల్ప లక్షణాలు ఉండడంతో ఇంట్లోనే చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన దుబ్బాక ఎన్నిక ప్రచారంలో పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా తెలంగానలో రాజకీయ ప్రముఖులందరికీ కరోనా సోకి తగ్గింది. కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్ హనుమంతరావుకు కరోనా వైరస్ నుంచి కోలుకున్నారు. అయితే అధికారికంగా ఈ విషయం బయటకు రాకున్నా ఆయనతో కాంటాక్టు ఉన్నవారిలో ఆందోళన నెలకొంది.