https://oktelugu.com/

మోడీపై మహారాష్ట్ర సీఎం వార్.. సీబీఐకి నో పర్మిషన్

సీబీఐ… కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దర్యాప్తు సంస్థ. కీలక కేసుల్లో విచారణ చేసే ఉన్నత వ్యవస్థ.  గతంలో అద్భుతంగా పని చేసిన ఈ సంస్థ ఇప్పుడు పలు విమర్శలు ఎదుర్కొంటోంది. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ లు .. తమ రాజకీయ అవసరాలకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయని పలువురు ఆరోపించిన సందర్భాలున్నాయి.   తమ చెప్పు చేతల్లో లేని నేతలు, రాష్ట్రాలు, ప్రతిపక్షాల నేతలపై సీబీఐ విచారణకు ఆదేశించి.. సదరు వ్యక్తులను తమకు లొంగి ఉండేలా పాలకులు […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 11:22 am
    Follow us on

    సీబీఐ… కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని దర్యాప్తు సంస్థ. కీలక కేసుల్లో విచారణ చేసే ఉన్నత వ్యవస్థ.  గతంలో అద్భుతంగా పని చేసిన ఈ సంస్థ ఇప్పుడు పలు విమర్శలు ఎదుర్కొంటోంది. కేంద్రంలో అధికారంలో ఉండే పార్టీ లు .. తమ రాజకీయ అవసరాలకు, స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటున్నాయని పలువురు ఆరోపించిన సందర్భాలున్నాయి.   తమ చెప్పు చేతల్లో లేని నేతలు, రాష్ట్రాలు, ప్రతిపక్షాల నేతలపై సీబీఐ విచారణకు ఆదేశించి.. సదరు వ్యక్తులను తమకు లొంగి ఉండేలా పాలకులు చేసుకుంటున్నారని అపవాదు ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా.. ఇటీవల సీబీఐ అంటేనే కొన్ని రాష్ట్రాలు మండిపడుతున్నాయి. రెండేళ్ల కిందట పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలు కూడా సీబీఐపై తీవ్ర ఆరోపణలు చేశాయి. దానిపై నిషేధం కూడా విధించాయి. కేంద్ర ప్రభుత్వం రాజకీయ ప్రయోజనాల కోసం ప్రతిపక్ష నేతలను ఇబ్బందులు పెడుతున్నాయని ఆరోపించాయి.

    Also Read: నాయిని అన్నా.. ఒగ్గేసి పోయావా?

    ఇప్పుడు అదే కోవాలోకి చేరాడు.. మరాఠా ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరే.  సీబీఐని మహారాష్ట్రలోకి అడుగుపెట్టనివ్వకుండా నిషేధం విధించి సంచలన నిర్ణయం తీసుకున్నాడు. రాత్రికి రాత్రే కేంద్ర దర్యాప్తు సంస్థ ఇక ముందు తమ రాష్ట్రంలో ఏ కేసులోనైనా దర్యాప్తు చేయాల్సి వస్తే.. ముందస్తుగా మహారాష్ట్ర ప్రభుత్వం పర్మిషన్ తీసుకునేలా ఉత్తర్వులు జారీ చేశారు.  కేసుకు సంబంధించిన  పూర్తి  వివరాలను ఆ రాష్ట్ర హోంమంత్రిత్వ శాఖకు అందజేయాల్సి ఉంటుంది. ఆ కేసు పూర్వాపరాలను పరిశీలించిన తర్వాత.. హోం మంత్రిత్వ శాఖ అధికారులు అనుమతి ఇస్తేనే సీబీఐ దర్యాప్తు చేయగలుగుతుంది.

    ఇటీవలి కాలంలో మహారాష్ట్రలో సీబీఐ అధికారులు దర్యాప్తు చేసిన కేసుల ఎన్నో ఉన్నాయి. బాలీవుడ్ స్టార్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతి కేసు, ఈ వ్యవహారంలోనే డ్రగ్స్ కేసు బయటకు రావడం.. అదలా కొనసాగుతున్న క్రమంలోనే టీఆర్పీ కుంభకోణం వెలుగులోకి రావడం.. వంటి వరుస సంఘటనలు చోటుచేసుకున్నాయి. అవన్నీ సీబీఐ పరిధిలోనివే కావడం గమనార్హం. పైగా  బాలీవుడ్ డ్రగ్స్ కేసులో నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో ఆఫీసర్లు సైతం జోక్యం చేసుకున్నారు. ఈ కేసు దర్యాప్తు వారి ఆధీనంలోకి వెళ్లింది. అదే టైంలో  టీఆర్పీ స్కాం  వ్యవహారం వెలుగులోకి రావడం.. దాన్ని కూడా సీబీఐకి అప్పగించడం వంటి పరిణామాలు జరిగాయి. ఈ కుంభకోణంలో ముంబై పోలీస్  కమిషనర్ పరమ్బీర్ సింగ్, రిపబ్లిక్ టీవీ చీఫ్ ఎడిటర్ ఆర్ణబ్ గోస్వామి మధ్య వివాదాలు తలెత్తాయి. అదే సమయంలో ఈ స్కాంలో ఉత్తర ప్రదేశ్ పోలీసులు కూడా జోక్యం చేసుకున్నారు. టీఆర్పీ స్కాంపై తొలి కేసు నమోదైంది కూడా యూపీలోనే. లక్నోలోని హజ్రత్ గంజ్  పోలీస్ స్టేషన్ లో తొలి కేసు నమోదైంది. దీన్ని అడ్డుగా పెట్టుకుని ఈ టీఆర్ పీ కుంభకోణం కేసును సీబీఐకి  అప్పగించారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

    Also Read: టీడీపీకి ఉప్పందిస్తున్నారు.. వైసీపీలో ఆ లీకు వీరులెవరు..?

    కేంద్ర ప్రభుత్వం తమ ప్రభుత్వంపై క్రమంగా ఉద్దేశపూర్వకంగా సీబీఐని ప్రయోగిస్తోందని భావించిన ఉద్దవ్ థాకరే ప్రభుత్వం  నిషేధానికి పూనుకుందని అంటున్నారు. సీబీఐని రాష్ట్రంలో నిషేధిస్తూ మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ ఉప కార్యదర్శి కైలాష్  గైక్వాడ్ ఉత్తర్వులు జారీ చేశారు. తమ అనుమతి లేనిదే సీబీఐ దర్యాప్తు చేపట్టకూడదని సూచించారు.  కేంద్ర సంస్థలపై ఇలా రాష్ట్రాలు భగ్గుమనడం మున్ముందు ఎలాంటి వైపరీత్యాలకు దారితీస్తోందనని ప్రజాస్వామిక వాదులు ఆవేదన చెందుతున్నారు. కేంద్రం పెద్దన్నలా ఆలోచించి దేశంలోని అన్ని రాష్ట్రాలకు సమ ప్రాధాన్యమిస్తూ, సామరస్య పూర్వక ధోరణితో ఉండడంతో పాటు రాష్ట్రాలు కూడా కేంద్రానికి సహకరిస్తూ ఉంటేనే మన దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ పరిఢవిల్లుతుందని ప్రజాస్వామిక వాదులు చెబుతున్నారు