https://oktelugu.com/

తిరుపతి బరిలో టీడీపీ..అభ్యర్థి ఆయనే..!

2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు.. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనుకాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడి అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో అధినేత బాబు ఇక్కడ పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. కానీ.. తమ్ముళ్లు మాత్రం పార్టీ తరఫున అభ్యర్థిని పెట్టాలంటూ ఫోర్స్‌ చేస్తున్నారట. గెలుపోటములను పక్కనబెట్టి బరిలో దిగాలని సూచిస్తున్నారట. వీరి ఒత్తిడితో చివరికి పోటీకి సై అన్నట్లు సమాచారం. Also Read: […]

Written By:
  • NARESH
  • , Updated On : October 22, 2020 / 10:38 AM IST
    Follow us on

    2019 అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ చంద్రబాబు.. తిరుపతి ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు వెనుకాడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఎందుకంటే అక్కడి అసెంబ్లీ నియోజకవర్గాల్లో దాదాపు వైసీపీ ఎమ్మెల్యేలే ఉన్నారు. దీంతో అధినేత బాబు ఇక్కడ పోటీకి పెద్దగా ఆసక్తి చూపడం లేదట. కానీ.. తమ్ముళ్లు మాత్రం పార్టీ తరఫున అభ్యర్థిని పెట్టాలంటూ ఫోర్స్‌ చేస్తున్నారట. గెలుపోటములను పక్కనబెట్టి బరిలో దిగాలని సూచిస్తున్నారట. వీరి ఒత్తిడితో చివరికి పోటీకి సై అన్నట్లు సమాచారం.

    Also Read: టీడీపీకి ఉప్పందిస్తున్నారు.. వైసీపీలో ఆ లీకు వీరులెవరు..?

    తిరుపతి సిట్టింగ్‌ ఎంపీ దుర్గా ప్రసాద్‌ ఇటీవల చనిపోయారు. దీంతో ఈ పార్లమెంట్‌ నియోజకవర్గానికి ఉప ఎన్నికల ఆనవార్యమైంది. అయితే.. గత సంప్రదాయాలను పాటిస్తూ పోటీకి దూరంగా ఉండాలని చంద్రబాబు ముందుగా నిర్ణయించారట. కానీ.. రాష్ట్రంలో సంప్రదాయాలకు కాలం చెల్లిందని సీనియర్‌‌ నేతలు ఆయన ముందు వ్యాఖ్యానించారు. సొంత జిల్లాలో పోటీ చేయకపోతే క్యాడర్‌‌లోకి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతామని చెబుతున్నట్లు తెలిసింది.

    తిరుపతి, సర్వేపల్లి, గూడురు నుంచి వినతులు భారీగా వచ్చి చేరుతున్నాయి. ‘మీరు ఏ అభ్యర్థిని నిర్ణయించినా కలిసికట్టుగా పనిచేసి గెలుపునకు కృషి చేస్తామని’ అంటున్నారు. ఇటీవల మృతి చెందిన సిట్టింగ్‌ ఎంపీ కూడా చాలా కాలం పాటు టీడీపీలోనే ఉన్నారు. దీంతో ఆయన కుటుంబ సభ్యులపై పోటీ పెట్టడం బాగుండదని మొదట్లో చంద్రబాబు అనుకున్నారని సమాచారం.

    Also Read: ‘జగన్‌ లేఖ’పై కొత్త కోణం.? సీజే పక్కన పడేస్తాడా..?

    తమ్ముళ్లు చంద్రబాబు అన్నివిధాలా భరోసా ఇవ్వడం.. పోటీకి పట్టుబట్టడంతో చివరికి ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే.. ఇప్పుడు ఎవరిని బరిలో దింపాలని చర్చ నడుస్తోంది. ఇందుకు చంద్రబాబు ఆ పార్లమెంట్‌ నియోకజవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల నేతల అభిప్రాయాలను చంద్రబాబు తీసుకోనున్నారు. మరోవైపు పార్టీ సీనియర్ నేత వర్ల రామయ్య పేరు చంద్రబాబు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసిన వర్లరామయ్యనే ఈ ఉప ఎన్నిక అభ్యర్థిగా నిలబెడుతున్నట్లు సమాచారం.