హైదరాబాద్‌లో రోడ్లుపై దాదాపు ఆరు నెలల తరువాత సిటీ బస్సులు నడుస్తున్నాయి. అయితే 25 శాతం బస్సులకు మాత్రమే అనుమతి ఉండడంతో ప్రయాణికులు పెద్దగా ఎవరూ సిటీ బస్సులను పట్టించుకోలేదు. అంతే కాకుండా కరోనా రోజురోజుకు విజృంభిస్తుండడంతో భయంతో ప్రయాణికులు బస్సుల్లో వెళ్లడానికి ఇష్టపడడం లేదు. కోవిడ్ నిబంధనల ప్రకారం మొత్తం 29 డిపోల నుంచి 630 బస్సులను తిప్పగా ప్రయాణికుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే రెండు, మూడు రోజుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని […]
హైదరాబాద్‌లో రోడ్లుపై దాదాపు ఆరు నెలల తరువాత సిటీ బస్సులు నడుస్తున్నాయి. అయితే 25 శాతం బస్సులకు మాత్రమే అనుమతి ఉండడంతో ప్రయాణికులు పెద్దగా ఎవరూ సిటీ బస్సులను పట్టించుకోలేదు. అంతే కాకుండా కరోనా రోజురోజుకు విజృంభిస్తుండడంతో భయంతో ప్రయాణికులు బస్సుల్లో వెళ్లడానికి ఇష్టపడడం లేదు. కోవిడ్ నిబంధనల ప్రకారం మొత్తం 29 డిపోల నుంచి 630 బస్సులను తిప్పగా ప్రయాణికుల నుంచి పెద్దగా రెస్పాన్స్ రాలేదు. అయితే రెండు, మూడు రోజుల్లో ప్రయాణికుల రద్దీ పెరుగుతుందని ఆర్టీసీ అధికారులు పేర్కొంటున్నారు.