గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా డబ్బులు పంచుతున్న టీఆర్ఎస్ నేతలపై చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు సోమవారం ఎన్నికల సంఘం కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్న పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేలా వ్యవహరిస్తున్ననేతలపై చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే రఘునందన్ రావు, రామచంద్రారావు, ఇంద్రసేనారెడ్డిలు పాల్గొన్నారు. దీంతో వారిని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.