
సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. రైతులు తమ పంటలను ఎక్కడైనా అమ్ముకోవచ్చనడం తప్పా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫాంహౌస్‌లో దొడ్డు వడ్లు పండించి లాభం పొందారని, రైతులను సన్నాలు పండించమని ముంచాడని మండిపడ్డారు. కచ్చితంగా రెచ్చగొడుతా.. రెచ్చిపోయేలా చేస్తానని స్పష్టం చేశారు. 80 శాతం ఉన్న హిందువుల కోసం పనిచేస్తామని బండి సంజయ్ ప్రకటించారు. హైదరాబాద్‌లో అవకాశం రాలేదని, తెలంగాణలో సర్జికల్ స్ట్రైక్ చేస్తామని తెలిపారు. ప్రజలను పట్టించుకోని సీఎం జగన్ మనకు అక్కర్లేదన్నారు. రాష్ట్రంలో మంత్రులు డమ్మీలు.. ఎవరికీ సీఎం అపాయింట్‌మెంట్ ఇవ్వరని ఎద్దేవాచేశారు. ఎంఐెం నేత ఓవైసీ అర్ధరాత్రి వచ్చినా సీఎం అపాయింట్‌మెంట్ ఇస్తారని ఆరోపించారు.