చాలామందికి పెరుగు తినడం విషయంలో అనేక అపోహలు ఉంటాయి. చలికాలంలో పెరుగు తినకూడదని తింటే ఆరోగ్య సమస్యలు వస్తాయని చాలామంది భావిస్తూ ఉంటారు. పెద్దలు తిన్నా పిల్లలు తినకూడదని అనుకుంటూ ఉంటారు. వైద్యులు చలికాలంలో పెరుగు తినడం గురించి స్పందిస్తూ శరీరానికి పెరుగు వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని.. ల్యాక్టోజ్ పరిమాణం పాలలో కంటే పెరుగులో తక్కువగా ఉంటుందని తెలుపుతున్నారు.
Also Read: వంకాయలు తీసుకోవడం వల్ల కలిగే లాభనష్టాలు ఇవే ?
కొంతమంది పాలు, పాలతో తయారైన ఇతర పాల ఉత్పత్తులను తింటే జీర్ణ సంబంధిత సమస్యలు వేధిస్తాయని.. అయితే అలాంటి వాళ్లు సైతం పెరుగును తినవచ్చని వైద్యులు వెల్లడిస్తున్నారు. పెరుగులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయని.. రోజూ పెరుగు తినడం చర్మం, గోళ్లు, వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయని చెబుతున్నారు. సైన్స్ పెరుగు ద్వారా శరీరానికి కావాల్సిన మంచి బ్యాక్టీరియా, శరీరానికి అవసరమైన క్యాల్షియం, బి విటమిన్ అందేలా చేస్తుందని చెబుతోంది.
Also Read: అలాంటి టూత్ పేస్ట్, సబ్బులు వాడుతున్నారా.. ఆరోగ్య సమస్యలు వచ్చే ఛాన్స్..?
సైన్స్ ప్రకారం శరీరానికి ఇమ్యూనిటీని పెంచడంలో పెరుగు సహాయపడుతుంది. అందువల్ల చలికాలంలో కూడా పెరుగును తినవచ్చు. అయితే శ్వాస సంబంధిత సమస్యలు, ఆస్తమా, జలుబు, దగ్గు సమస్యలు వేధిస్తుంటే మాత్రం సాయంత్రం 5 తర్వాత పెరుగు తినకపోవడమే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్లు పగలు, రాత్రి పెరుగు తినవచ్చని.. ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే మాత్రం పగలు మాత్రమే పెరుగును తినాలని వైద్యులు చెబుతున్నారు.
మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం
చలికాలంలో పెరుగును ఫ్రిజ్ లో పెట్టి తీసుకోవడం కంటే సాధారణంగా తీసుకోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఫ్రిజ్ లో పెట్టుకున్న పెరుగును మాత్రం రాత్రి సమయంలో తీసుకోకపోవడమే మంచిదని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.