
సంగారెడ్డి జిల్లాలో ఈనెల 21న జొన్నరొట్టెలు తిన్నవారిలో చికిత్సపొందుతూ మరొకరు మృతి చెందారు. సంగారెడ్డి జిల్లా వట్ పల్లి మండలంలో గత సోమవారం జొన్నరొట్టె తిని ఒకే కుటుంబానికి చెందిన చంద్రమౌళి, శ్రీశైలం, సుశీల లు మృతి చెందిన విషయం తెలిసింది. వీరితో పాటే రొట్టెలు తిన్న అనుసూజ తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో బీబీఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా ఆమె చికిత్స పొందుతూ మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మరో మహిళ సరిత ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు వారు పేర్కొన్నారు.