https://oktelugu.com/

ఆదిలాబాద్ లో కాల్పుల ఘటన: ఒకరు మృతి

ఆదిలాబాద్ లో జరిగిన కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందారు. ఈనెల 18న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఐఎం జిల్లా నేత ఫరూక్ అహ్మద్ ఒక చేత్తో రివాల్వర్ తో కాల్పులు జరపగా, మరో చేత్తో కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో మన్నన్, సయ్యద్ జమీర్ అనే వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ సయ్యద్ జమీర్ అనే వ్యక్తి […]

Written By:
  • Velishala Suresh
  • , Updated On : December 26, 2020 / 09:28 AM IST
    Follow us on

    ఆదిలాబాద్ లో జరిగిన కాల్పుల ఘటనలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి చెందారు. ఈనెల 18న ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో ఎంఐఎం జిల్లా నేత ఫరూక్ అహ్మద్ ఒక చేత్తో రివాల్వర్ తో కాల్పులు జరపగా, మరో చేత్తో కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో మన్నన్, సయ్యద్ జమీర్ అనే వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వీరిలో చికిత్స పొందుతూ సయ్యద్ జమీర్ అనే వ్యక్తి శనివారం మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. దీంతో ఆదిలాబాద్ లో టెన్షన్ వాతావరణం నెలకొంది.