Homeఎంటర్టైన్మెంట్రజినీకాంత్ కు తెలుగు సినిమా పెద్దల బాసట.. చూసుకుంటున్న మోహన్ బాబు

రజినీకాంత్ కు తెలుగు సినిమా పెద్దల బాసట.. చూసుకుంటున్న మోహన్ బాబు

Rajinikanth Mohan babu
అన్నాత్తే షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన రజినీకాంత్ అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. ఆయన అస్వస్థతకు గురికావడంతో శుక్రవారం అపోలో హాస్పిటల్స్ లో జాయిన్ చేశారు. రజినీకాంత్ ఆరోగ్యం పై నిన్న అపోలో ఆసుపత్రి వర్గాలు బులెటిన్ విడుదల చేశాయి. బీపీ హెచ్చుతగ్గుల కారణంగా ఆయన అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. అలాగే రజినీకాంత్ కి కోవిడ్ పరీక్షలు నిర్వహించగా నెగెటివ్ అని తేలిందని లేఖలో పొందుపరచడం జరిగింది. రజినీకాంత్ కి కోవిడ్ సోకలేదని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, అభిమానులు ఆనందం వ్యక్త్తం చేశారు.

Also Read: సింగర్ సునీత ప్రీవెడ్డింగ్ పార్టీ.. కేరాఫ్ ఆఫ్ ‘గచ్చిబౌలి’

ఇక రజినీకాంత్ అనారోగ్యానికి గురికావడంతో పలువురు సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు. రజినీకాంత్ కి అత్యంత సన్నిహితుడైన మోహన్ బాబు రజినీ ఆరోగ్యం గురించి ఆందోళన చెందినట్లు తెలుస్తుంది. విషయం తెలిసిన వెంటనే మోహన్ బాబు… రజనీ భార్య లత, కూతురు ఐశ్వర్యలతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారట. ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదు, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని వారు చెప్పడంతో మోహన్ బాబు స్థిమిత పడ్డారట.

Also Read: ఈ టైమ్ లో అంత బలుపు అవసరమా రవితేజా!

ఇక రజినీ కాంత్ మానసికంగా, శారీరకంగా ధృడమైన వారు… ఆయన త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని మోహన్ బాబు ఆశాభావం వ్యక్తం చేశారు. రజినీ ఆరోగ్యం పట్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఏమీ లేదన్న డాక్టర్స్, కొంచెం విశ్రాంతి కావాలి అన్నారట. కాగా నిన్న రజినీ కాంత్ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తూ పవన్ కళ్యాణ్ లేఖ విడుదల చేశారు. ఇటీవల తన పొలిటిక్ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన రజినీ కాంత్, 2021 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన అన్నాత్తే మూవీ షూటింగ్ త్వరగా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ఈ మూవీ షూటింగ్ లో పాల్గొన్న కొందరు కోవిడ్ బారిన పడగా… రజనీకాంత్ ఆందోళనకు గురయ్యారు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version