Site icon OkTelugu

దుర్గమ్మ ఆలయంలో ‘గుడికో గోమాత’

ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో గుడికో గోమాత కార్యక్రమం సోమవారం ఉదయం ప్రారంభమైంది. టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వై.వి.సుబ్బారెడ్డి, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, రమణ దీక్షితులు, తిరుమల తిరుపతి సలహాదారులు, ఐఏఎస్ అధికారులు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా వైవీసుబ్బారెడ్డి మాట్లాడుతూ… ప్రతి ఆలయంలో ఒక గోవును కచ్చితంగా పూజించాలన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో తిరుమల నుంచి గోవులను తీసుకువచ్చి అమ్మవారికి ఇచ్చామని తెలిపారు.

Exit mobile version