https://oktelugu.com/

“సలార్” దెబ్బకు ప్రభాస్ సినిమాల రాక మారింది !

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే మరో సినిమా అనౌన్స్ మెంట్ వచ్చిన తరుణంలో ఇప్పుడు ప్రభాస్ సినిమాల రిలీజ్ ప్లానింగ్ మొత్తం మారిపోయే అవకాశం ఉంది. పైగా “సలార్” సినిమాకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేయబోతున్నాడు. ప్రశాంత్ కూడా సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తాడు కాబట్టి.. కచ్చితంగా ప్రభాస్ ఈ సినిమాకి బల్క్ డేట్స్ కేటాయించాలి. అలా కేటాయిస్తే.. ఆల్ రెడీ ఒప్పుకున్న సినిమాలకు బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. […]

Written By:
  • admin
  • , Updated On : December 3, 2020 / 05:32 PM IST
    Follow us on


    నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా “సలార్” అనే మరో సినిమా అనౌన్స్ మెంట్ వచ్చిన తరుణంలో ఇప్పుడు ప్రభాస్ సినిమాల రిలీజ్ ప్లానింగ్ మొత్తం మారిపోయే అవకాశం ఉంది. పైగా “సలార్” సినిమాకు కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ డైరెక్షన్ చేయబోతున్నాడు. ప్రశాంత్ కూడా సంవత్సరాల తరబడి సినిమాలు చేస్తాడు కాబట్టి.. కచ్చితంగా ప్రభాస్ ఈ సినిమాకి బల్క్ డేట్స్ కేటాయించాలి. అలా కేటాయిస్తే.. ఆల్ రెడీ ఒప్పుకున్న సినిమాలకు బాగా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అన్నట్లు హోంబాలే ఫిలిమ్స్ సలార్ సినిమాని నిర్మిస్తుంది. ఈ సినిమా సంస్థ కూడా తొందరగా తేల్చదు.

    Also Read: చివరిదశలో అందాలు ఒలకబోస్తోన్న శృతి హాసన్ !

    అయితే జనవరిలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అని ప్రభాస్ ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ అందర్నీ షాక్ కి గురిచేసిందనే చెప్పాలి. ఎందుకంటే.. దీనికన్నా ముందే ఓం రౌత్ డైరెక్షన్ లో “ఆదిపురుష్” సినిమాను అనౌన్స్ చేశాడు ప్రభాస్. అప్పుడు ప్రకటించినప్పుడు కూడా “ఆదిపురుష్” జనవరి 2021లో ప్రారంభం అవుతుందని ప్రభాస్ చెప్పుకొచ్చాడు. మరి ఇప్పుడు జనవరిలో ఏ సినిమాని మొదలు పెడతాడో చూడాలి. నిజానికి ఈ రెండు సినిమాల కన్నా ముందు “మహానటి” దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్క్షన్ లో ఓ సైన్స్ ఫిక్షన్ మూవీ ఉంటుందని ఎనౌన్స్ చేసిన ప్రభాస్.. ఈ సినిమాని కూడా వచ్చే ఏడాదే ప్లాన్ చేశారు.

    Also Read: పార్టీలో మెగా ఫ్యామిలీ…నిహారిక గ్రాండ్ పార్టీ

    కానీ, ఇప్పుడున్న పరిస్థితుల్లో అది సాధ్యం అయ్యేలా కనిపించడం లేదు. నాగ్ అశ్విన్ సినిమా పోస్ట్ ఫోన్ అవ్వకతప్పదు. పైగా ఈ సినిమాలో ప్రభాస్ తో పాటు అమితాబ్, దీపికా కూడా కీలక పాత్రలు చేస్తున్నారు కాబట్టి.. వాళ్ళ డేట్స్ కూడా అన్ని చూసుకోవాలి. అందుకే నాగ్ అశ్విన్ మూవీ వెనెక్కి వెళ్ళిందట. ముందుగా “సలార్” మొదలుపెట్టి 2021లో పూర్తీ చేసి.. 2022 ఆగస్టు లోపు కూడా “ఆదిపురుష్” ముగించి.. 2023లో నాగ్ అశ్విన్ సినిమా రిలీజ్ అయ్యేలా ప్రభాస్ ప్లాన్ చేసుకున్నాడట.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్