
దుబ్బాక నియోజకవర్గంలో గతంలో కంటే ఎక్కువ మెజారిటీతో గెలుస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏ ఎన్నిక వచ్చినా ప్రజలు టీఆర్‌ఎస్‌కు విజయాన్ని అందిస్తున్నారని కేటీఆర్ అన్నారు. రైతు బంధు పథకం ద్వారా మరో రూ. 28వేల కోట్లు ఇచ్చినట్లు చెప్పారు. ఇప్పటి వరకు రూ. 27 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు.