Telangana Elections 2023 : తెలంగాణ ఎన్నికలు : సీ-విజిల్‌ యాప్‌ గురించి మీకు తెలుసా?

సీ- విజిల్‌ యాప్‌ను గూగుల్‌ ప్టేస్టోర్స్‌, ఎన్నికల కమిషన్‌ , రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Written By: NARESH, Updated On : October 10, 2023 10:10 pm
Follow us on

Telangana Elections 2023 : ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించే వారిపై పౌరులూ ఫిర్యాదు చేసే అవకాశాన్ని ఎన్నికల సంఘం అందుబాటులోకి తీసుకొచ్చింది. విచ్చలవిడిగా మద్యం , డబ్బులు పంపిణీ చేసి గద్దెనెక్కాలనుకునే నేతల గురించి పౌరులు ఫిర్యాదు చేయవచ్చు.సీ విజిల్‌ యాప్‌( సిటిజన్స్‌ విజిలెన్స్‌) పేరుతో ప్రారంభించిన ఈ ఆండ్రాయిడ్‌ యాప్‌ సహకారంతో భారత ఎన్నికల సంఘం రాజకీయ నాయకులపై ప్రజలను షాడో టీంలుగా వినియోగించనుంది. అభ్యర్థులు చేసే రెచ్చగొట్టే ప్రచారాలు, డబ్బులు, నజరానాల పంపిణీ, చర్యలను వీడియో, ఫొటోలు స్వయంగా తీసి ఈ యాప్‌ ద్వారా పంపించవచ్చు. ఫిర్యాదు అందిన నిమిషాల్లోనూ అధికారులు చర్యలు ప్రారంభమవుతాయి. అధికారులు తాము తీసుకున్న చర్యలను గురించి ఫిర్యాదు దారుడికి 100నిమిషాల్లో వివరించనున్నారు.

సీ-యాప్‌ గురించి…

సీ- విజిల్‌ యాప్‌ను గూగుల్‌ ప్టేస్టోర్స్‌, ఎన్నికల కమిషన్‌ , రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వెబ్‌సైట్‌నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈయాప్‌ ద్వారా చిత్రీకరించే వీడియోలు, ఫోటోలనే అధికారులు పరిగణలోకి తీసుకుంటారు. వేరే యాప్‌లో చిత్రీకరించిన ఈ యాప్‌లోకి అప్‌లోడ్‌ చేస్తే చెల్లుబాటు కావు. సీ విజిల్‌ ద్వారా వీడియో ఫోటోలు చిత్రీకరించే టప్పడు ఆటోమేటిక్‌గా వాటికి జియోట్యాగింగ్‌ వస్తుంది.అధికారుల దర్యాప్తులో అతే కీలకం అవుతుంది. యాప్‌ ద్వారా అందే ప్రతి పిర్యాదుకూ ఒక విశిష్ట సంఖ్య కేటాయించి స్ర్కూటినీ చేస్తారు. నిమిషాల వ్యవధిలోనే సంబందిత అధికారులు రంగంలోకి దిగుతారు అవసరాన్ని బట్టి పోలీస్‌ కేసు నమోదు చేస్తారు. 100 నిమిషాల్లో ఫిర్యాదుదారుడికి చర్యలపై వివరాలు వెల్లడిస్తారు. సమాచారాన్ని అందించిన వారి వివరాలు మాత్రం అత్యంత గోప్యంగా ఉంచుతారు.