Sanchar Saathi: ప్రస్తుతం ఏ పని కోసమైనా స్మార్ట్ Smart Phone తప్పనిసరిగా వాడుతున్నారు. సొంత అవసరాలతో పాటు ఉద్యోగ, వ్యాపార అవసరాలకు కూడా Mobile లేకపోతే పనులు కావడం లేదు. ఈ క్రమంలో పర్సనల్ కు సంబంధించిన లేదా ఫ్యామిలీకి సంబంధించిన లేదా బ్యాంకుకు సంబంధించిన డేటా మొత్తం ఫోన్లో నిక్షిప్తమై ఉంటుంది. మనీ Sending లేదా కొన్ని ముఖ్యమైన ఫైల్స్ అన్ని కూడా ఇందులోనే స్టోర్ అయి ఉంటాయి. అయితే కొందరు మొబైల్ కు సంబంధించిన వివరాలు తెలుసుకొని వినియోగదారుల వ్యక్తిగత డేటాను చోరీ చేస్తున్నారు. దీని నివారణకు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా మొబైల్ వినియోగదారులు మాత్రం సమస్యలు ఎదుర్కొంటూనే ఉన్నారు. దీంతో కేంద్ర ప్రభుత్వం తాజాగా కొత్త Mobile App ను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ద్వారా ఈ సమస్యలకు పెట్టవచ్చని భావిస్తుంది. ఇంతకీ App ఎలా ఉంటుందో తెలుసా…?
Cyber నేరగాళ్ల నుంచి వినియోగదారులను రక్షించడానికి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసింది.. అయితే తాజాగా కేంద్ర సమాచార శాఖ మంత్రి జ్యోతిరాధిత్య జనవరి 24వ తేదీన సంచార్ సాధి మొబైల్ యాప్ ను ప్రారంభించారు. ఈ యాప్ ద్వారా మొబైల్ కు సైబర్ నేరస్తుల నుంచి రక్షణ ఉంటుందని తెలిపారు.
అలాగే మొబైల్ కు సంబంధించిన డేటా మొత్తం ఈ యాప్ లో తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. ఒక మొబైల్ పై ఎన్ని రకాల సిమ్ లో ఉన్నాయి..? అవసరం లేని వాటిని ఎలా డియాక్టివేట్ చేసుకోవాలి..? అనే విషయాలు కూడా ఉంటాయి మరోవైపు మొబైల్ చొరికి గురైన కూడా.. ఈ యాప్ లో ఫిర్యాదు చేయడం వల్ల పోలీసులకు నేరుగా ఫిర్యాదు వెళుతుంది. అంతేకాకుండా మొబైల్ ఎక్కడ ఉందో వారు ఈ ఫిర్యాదు ద్వారా ట్రేస్ చేస్తారు.
ఇప్పుడున్న పరిస్థితుల్లో కాల్స్ లేదా మెసేజ్ లు హ్యాక్ కు గురవుతున్నాయి. అయితే తమ ఫోన్ హ్యాక్ కు గురైందా.? లేదా..? అనే విషయాన్ని కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు. Spam కాల్స్ లేదా అవసరం లేని కాల్స్ తో వినియోగదారులకు చికాకులు తెప్పిస్తున్నాయి. ఈ కాల్స్ రాకుండా ఉండడానికి కూడా మొబైల్లో ఉండే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకుంటే ఫలితం ఉంటుంది.
ఈ యాప్ ను 2023లోనే అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ ఇటీవల దీనిని మరింతగా అభివృద్ధి చేసి జనవరి 24న అధికారికంగా ప్రారంభించారు. ఇది ప్రతి ఒక్కరూ మొబైల్ లో డౌన్లోడ్ చేసుకొని అవసరమైన దానికి ఉపయోగించుకోవాలి. అయితే ఇందులో ఏదైనా అవసరం కావాలనుకుంటే ముందుగా మొబైల్ కు సంబంధించిన ఐఎమ్ఈఐ నెంబర్ ను ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. అలా చేయడం వల్ల మొబైల్ కు సంబంధించిన డీటెయిల్స్ ముందుగా వస్తాయి. ఆ తర్వాత అప్పుడు వినియోగదారుడు ఎలాంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో ఫిర్యాదు చేయవచ్చు ఆ తర్వాత సమస్య పరిష్కారానికి ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోవచ్చు అని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య తెలిపారు.