Whatsapp: ప్రస్తుత కాలంలో చాలామంది మొబైల్ లో WhatsApp తప్పనిసరిగా ఉంటుంది. విద్యార్థుల నుంచి ఉద్యోగులు, వ్యాపారుల వరకు వాట్సాప్ ను వాడని వారు లేరనే చెప్పుకోవచ్చు. టెక్స్ట్ మెసేజ్ నుంచి ఫోటోలు, వీడియోలు, వాయిస్ రికార్డులు పంపించుకోవడానికి వాట్సప్ ఎంతో సౌకర్యంగా ఉంటుంది. Meta సంస్థకు చెందిన ఈ వాట్సాప్ ను వినియోగదారులకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ వస్తున్నారు. కొందరు తమకు కావాల్సిన ఫీచర్స్ ను అడగగా వారికి అనుగుణంగా వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. అయితే తాజాగా Whatsapp లోకి కొత్త ఫీచర్ రాబోతుంది. ఇది కమ్యూనికేషన్ ను పెంచడానికి మరింతగా ఉపయోగపడుతుందని meta సంస్థ పేర్కొంటుంది. ఇంతకీ ఫీచర్ ఏంటో తెలుసుకోవాలని ఉందా..? అయితే ఈ వివరాల్లోకి వెళ్ళండి…
వాట్సాప్ ద్వారా Photos వీడియోస్ తో పాటు వాయిస్ మెసేజ్ ని కూడా పంపించుకుంటూ ఉంటాం. ఏదైనా అత్యవసర సమయంలో మెసేజ్ కొట్టడానికి సమయం పడుతుంది. అందువల్ల Voice Message ని చేస్తూ ఉంటారు. అయితే వాయిస్ మెసేజ్ చేసే సమయంలో ఇబ్బందిగా ఉండవచ్చు. ట్రాఫిక్ లోనో లేదా ఇతర ప్రదేశాల్లో ఉన్నప్పుడు వాయిస్ మెసేజ్ క్లియర్గా ఉండదు. అంతేకాకుండా అత్యవసర మెసేజ్ ను ఎదుటి వాళ్ళకి అర్థం కావాలంటే వాయిస్ మెసేజ్ ఒక్కోసారి అనుగుణంగా ఉండకపోవచ్చు.
ఈ ఇబ్బందిని గుర్తించిన మెటా సంస్థ తాజాగా వాయిస్ టు టెక్స్ట్ మెసేజ్ ని అందుబాటులోకి తీసుకురాబోతుంది. అయితే వాయిస్ టూ టెక్స్ట్ ఆప్షన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. కానీ అన్ని మొబైల్లలో ఇది రావడం లేదు. మరోవైపు మనకు ఏ లాంగ్వేజ్ లో కావాలంటే దానిని సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం వచ్చే ఫీచర్ 4 ప్రపంచ భాషల్లో మాత్రమే ఉంటుంది. అయితే ఇది మనకు కావాల్సిన భాషను ఆప్షన్ ను ఎంచుకోకుండా ట్రాన్స్లేట్ టు లాంగ్వేజ్ అని సెట్ చేసుకోవాలి. ఉదాహరణకు తెలుగులో మెసేజ్ కావాలని అనుకుంటే ట్రాన్స్లేట్ టు తెలుగు అని సెట్ చేసుకునీ ఆ తర్వాత వాయిస్ చేయడం వల్ల ఎలాంటి వాయిస్ చేస్తున్నామో అదే టెక్స్ట్ రూపంలో మారుతుంది. దానిని ఎదుటి వారికి వెంటనే పంపించుకునే అవకాశం ఉంటుంది.
సాధారణంగా వాయిస్ ఎదుటివారికి క్లియర్గా వినిపించకపోవచ్చు. కానీ వాయిస్ టు టెక్స్ట్ చేయడం వల్ల ఇది ఎదుటివారికి క్లియర్ గా అర్థమవుతుంది. దీంతో ఈ ఫీచర్ ఎన్నో ప్రయోజనాలు కలిగిస్తుందని అంటున్నారు. అయితే ఈ ఫీచర్ రావడానికి కొంత సమయం పడుతుందని అంటున్నారు. మరోవైపు ప్రస్తుతం నాలుగు భాషల్లోనే దీని సెట్ చేశారు. ఆ తర్వాత అన్ని భాషల్లో దీనిని ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకొస్తారని అంటున్నారు. ఏది ఏమైనా టెక్స్ట్ మెసేజ్ పంపించుకునే వారికి ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని చెబుతున్నారు. అయితే ఇదే తెలుగులోకి ఎప్పుడు వస్తుందో చూడాలి.