Budget 2025
Budget 2025 : మోడీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత రెండో బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. భారతదేశం-పాకిస్తాన్ విభజన గురించి ప్రతి ఒక్కరూ వినే ఉంటారు. కానీ భారతదేశం , పాకిస్తాన్ విడిపోకపోతే భారతదేశ బడ్జెట్ ఎంత అయ్యేది అనే ఎప్పుడైనా ఆలోచించారా.. ఈ రోజు ఆ ఆలోచనకు సమాధానం తెలుసుకుందాం.
భారత బడ్జెట్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మూడవసారి అధికారంలోకి వచ్చిన 2025-2026 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. 2024 లో లోక్‌సభ ఎన్నికల కారణంగా జూలై నెలలో బడ్జెట్‌ను సమర్పించారు. ప్రధానమంత్రి మోదీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మోడీ 3.0 పదవీకాలంలో మొదటి బడ్జెట్‌ను జూలై 23, 2024న ప్రవేశ పెట్టారు. ఎందుకంటే దీనికి ముందు దేశంలో 18వ లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. దీనిలో మరోసారి కేంద్రంలో ఎన్డీఏ మోడీ ప్రభుత్వం ఏర్పడింది.
2024 సంవత్సరానికి బడ్జెట్
భారత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత సంవత్సరం ఫిబ్రవరి 1, 2024న మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్ రూ. 47,65,768 కోట్లు, ఇది 2023 కంటే 6 శాతం ఎక్కువ. పాకిస్తాన్, భారతదేశం ఒకటి అయితే భారతదేశ బడ్జెట్ ఎంత ఉండేది? ఏ దేశ బడ్జెట్ అయినా ఆ దేశ ఆర్థిక వ్యవస్థ, జనాభాపై ఆధారపడి ఉంటుంది. కాబట్టి పాకిస్తాన్ భారతదేశంలో ఉంటే బడ్జెట్ ఎంత ఉండేదో చెప్పడం కష్టం. పాకిస్తాన్ 2024-25 ఆర్థిక సంవత్సర బడ్జెట్ 18,877 బిలియన్ పాకిస్తానీ రూపాయలు. అంటే, భారత రూపాయలలో అది రూ.5.65 లక్షల కోట్లు. సరళంగా చెప్పాలంటే, భారతదేశ బడ్జెట్ పాకిస్తాన్ కంటే 8 రెట్లు ఎక్కువ.
పాకిస్తాన్‌లో బడ్జెట్‌ను ఎప్పుడు ప్రవేశపెడతారు?
భారతదేశంలో బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న ప్రవేశపెడతారు. కానీ పాకిస్తాన్‌లో ప్రతి సంవత్సరం జూన్ ప్రారంభంలో బడ్జెట్‌ను ప్రవేశపెడతారు. అయితే, దీనికి నిర్దిష్ట రోజును నిర్ణయించలేదు. కానీ పాకిస్తాన్‌లో ఆర్థిక సంవత్సరం జూలై 1 నుండి ప్రారంభమవుతుంది. పాకిస్తాన్‌లో బడ్జెట్‌ను సమర్పించే ముందు, మంత్రివర్గం ఆమోదం పొందుతుంది. ఆ తర్వాత ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక మంత్రి జాతీయ అసెంబ్లీలో తన బడ్జెట్ ప్రసంగం చేస్తారు. పాకిస్తాన్‌లో జాతీయ అసెంబ్లీలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టే రోజున ఇతర కార్యకలాపాలకు అనుమతి లేదు. భారతదేశ బడ్జెట్ పాకిస్తాన్ కంటే చాలా ఎక్కువ. దీనికి అతి పెద్ద కారణం పాకిస్తాన్ ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడం, పాకిస్తాన్ అప్పుల్లో కూరుకుపోవడమే.