Send money without internet: ఇప్పుడున్న కాలంలో ఎవరు ఎక్కడి నుంచి అయినా డబ్బులు పంపించుకోవచ్చు. చేతిలో మొబైల్ నుండి అందులో ఇంటర్నెట్ సౌకర్యం ఉంటే మనీ ట్రాన్సాక్షన్ మరి ఈజీగా మారిపోతుంది. అయితే డిజిటల్ చెల్లింపులు చేయడానికి.. రిసీవ్ చేసుకోవడానికి ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండేది. కానీ ఇప్పుడు ఇంటర్నెట్ లేకున్నా కూడా డబ్బులు పంపించుకునే అవకాశాన్ని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రత్యేక సేవలను ప్రారంభించింది. ఈ సేవల ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ప్రజలు సైతం ఇంటర్నెట్ అవసరం లేకుండా మరీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. అంతేకాకుండా కీప్యాడ్ ఫోన్ ఉన్నవారు సైతం ఈ సేవలను వినియోగించుకోవచ్చు. మరి ఇంటర్నెట్ లేకుండా డబ్బులు పంపించడం ఎలా? అందుకోసం ఏం చేయాలి?
మొబైల్ లేకుండా ప్రస్తుతం ఏ పని జరగడం లేదు. కమ్యూనికేషన్ తో పాటు మనీ ట్రాన్సాక్షన్ కు మొబైల్ ప్రధాన వాహకంగా ఉంటుంది. ఇప్పుడు చాలామంది చేతిలో స్మార్ట్ మొబైల్ కచ్చితంగా ఉంటుంది. గ్రామాల్లోనూ స్మార్ట్ ఫోన్ వాడే వారి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది. కొన్ని అవసరాలకు మొబైల్ తప్పనిసరిగా మారిపోయింది. వీటిలో డబ్బులు పంపడానికి, బిల్లులు చెల్లించడానికి, ఇతరుల వద్ద నుంచి డబ్బును రిసీవ్ చేసుకోవడానికి మొబైల్ మరీ ముఖ్యంగా మారిపోయింది. మనీ ట్రాన్సాక్షన్ చేయడానికి ఇప్పటివరకు ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉండేది. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఇంటర్నెట్ సౌకర్యం లేకుండా డబ్బులు చెల్లించే అవకాశం ఉండేది కాదు. అత్యవసర సమయంలో ఇబ్బందులు ఎదుర్కొనే వారు. ఫలితంగా ఇంటర్నెట్ అవసరం లేకుండా కూడా డబ్బులు చెల్లించుకోవచ్చు.
ఇంటర్నెట్ అవసరం లేకుండా డబ్బులు చెల్లించేవారు ముందుగా ఒక చిన్న పని చేయాలి. ఈ సేవలను ఉపయోగించుకోవడానికి మొబైల్ లోని డయల్ ప్యాడ్ లో *99#అని టైప్ చేయాలి. ఇలా చేయగానే బ్యాంకింగ్ సేవల మెనూ డిస్ప్లే అవుతుంది. ఇందులో మనకు కావాల్సిన ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత చివరికి UPI పిన్ అడుగుతుంది. ఈ పిన్ ఎంటర్ చేస్తే డబ్బులు కావలసిన వారికి వెళ్ళిపోతాయి. అయితే అంతకుముందే యూపీఐ లో రిజిస్టర్ అయి ఉండాలి. అలా ఉంటే మరింత సులభంగా మారుతుంది. పిన్ లేకుండా డబ్బులు పంపడానికి ఆస్కారం ఉండదు. ఈ ప్రాసెస్ చేసేటప్పుడు అవగాహన ఉండాలి. ఎందుకంటే ఇందులో అకౌంట్ నెంబర్ తప్పుగా నమోదు చేస్తే సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా యూపీఐ పిన్ నెంబర్ కూడా జాగ్రత్తగా నమోదు చేయాలి.
ఈ విధానాన్ని కీప్యాడ్ ఫోన్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ప్రస్తుతం చాలామంది మొబైల్స్ లో ఇంటర్నెట్ తప్పనిసరిగా ఉంటుంది. కానీ రూరల్ ప్రాంతాల్లోకి వెళ్లిన తర్వాత ఒక్కోసారి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి సమయంలో ఈ సేవలను వినియోగించి మనీ ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు.