https://oktelugu.com/

palm oil : పామాయిల్ వాడటం మంచిదా? కాదా?

ప్రపంచ వ్యాప్తంగా అందరికీ లభ్యమయ్యే ఆయిల్స్‌లో పామాయిల్ ఒకటి. ధనవంతుల కంటే మధ్య తరగతి కుటుంబాలకు చెందిన వారే ఈ పామాయిల్‌ని ఎక్కువగా వినియోగిస్తున్నారు. కేవలం భారత దేశంలోనే కాదు.. మలేషియ, ఇండోనేషియా, నైజీరియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికాలో వంటి దేశాల్లో కూడా ఈ పామాయిల్ లభ్యం అవుతుంది. ప్రజలు వినియోగిస్తున్నారు. అయితే ఈ పామాయిల్ అనేది తాటి చెట్టు నుంచి తయారైన నూనె. ఇందులో రెండు రకాలు ఉంటాయి. తాటిపండు గుజ్జుతో తయారుచేసిన నూనెని పామాయిల్ గా పిలుస్తున్నారు. కొన్ని దేశాల్లో ఈ ఆయిల్‌ని వెజిటేబుల్ ఆయిల్‌గా వినియోగిస్తారు. దీనిని స్నాక్స్‌ ఫ్రై చేయడానికి ఎక్కువ ఉపయోగిస్తారు. మరి ఈ ఆయిల్ ను మీరు ఉపయోగిస్తున్నారా? లేదా? దీని వల్ల ఏమైనా ప్రయోజనాలు ఉన్నాయా అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : October 18, 2024 / 04:06 PM IST

    Is it good to use palm oil? isn't it

    Follow us on

    palm oil : ఈ పామాయిల్ ఉత్పత్తి విదేశాల్లోనే ఎక్కువగా ఉంటుంది. మొదటి సారి కోల్‌కత్తాలో పామాయిల్ చెట్లను నాటారు. అక్కడ నుంచే ఆయిల్ ఉత్పత్తి మొదలు పెట్టారు. పామాయిల్ చెట్ల నుంచి పండ్ల గుజ్జు తీసి ఆయిల్ తయారు చేస్తుంటారు. అయితే ఈ పామాయిల్ తినడం అస్సలు మంచిది కాదు అంటున్నారు నిపుణులు. ఇందులో హానికరమైన పదార్థాలు ఉంటాయట. కానీ పలు పరిశోధనల ఆధారంగా.. ఆరోగ్య నిపుణులు చెబుతున్న మాటలు మాత్రం దీనికి విరుద్దంగా ఉన్నాయి. పామాయిల్ తీసుకోవడం హెల్త్‌కి మంచిది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

    ఈ ఆయిల్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీ అన్ శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు లభిస్తాయట. ఇవి శరీరానికి చాలా మేలు చేస్తాయి. రక్తంలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కరిగించడంలో సహాయం చేస్తుంది పామాయిల్. రేషన్ దుకాణాల్లో లభించే పామాయిల్ తీసుకుంటే గుండెకు మరింత మంచిది. ఇందులో ఎలాంటి హానికరమైన పదార్థాలు కలవవట. ప్రభుత్వం తక్కువ ధరకు ఇస్తూండటంతో.. నాసిరకం అనే అపోహ చాలా మందిలో పేరుకొని పోయింది. అయితే ఈ ఆయిల్ తక్కువ తీసుకుంటున్నారు. అతిగా కాకుండా మితంగా తీసుకుంటే పామాయిల్ మంచిదే.

    పామాయిల్‌లో సంతృప్త కొవ్వులు తక్కువగా ఉన్నప్పటికీ దానిని రెగ్యులర్‌గా వాడడం మాత్రం మంచిది కాదు. హెల్దీ లైఫ్‌స్టైల్ ఫాలో అవ్వాలనుకునేవారు ఆలివ్ ఆయిల్ వంటివి వాడటం బెటర్. కానీ పూర్తిగా ఈ పామాయిల్ ను స్కిప్ చేయవద్దు. ఇందులో మంచి చేసే గుణాలు ఉన్నాయి కాబట్టి అప్పుడప్పుడు వాడాలి అంటున్నారు నిపుణులు.

    పామాయిల్‌లో అధికంగా సెచురేటెడ్ ఫ్యాట్లు ఉండటా కాబట్టి శరీరంలో LDL అనే చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది. చెడు కొలెస్ట్రాల్ పెరగితే రక్తనాళాల్లో బ్లాక్‌లు ఏర్పడతాయి. ఇది గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తుంది అంటున్నారు నిపుణులు. పామాయిల్ తో చేసే ప్రాసెస్డ్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్ వాడితే గుండె ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా, ప్రతి రోజూ అధిక పామాయిల్ తీసుకోవడం వల్ల దీర్ఘకాలికంగా గుండె సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు.