https://oktelugu.com/

Whatsapp : వాట్సాప్ వినియోగదారులూ.. ఈ విషయాలు తెలుసుకోకపోతే డేంజరే..!

మీరు వాట్సాప్ ద్వారా చేసే వాయిస్ కాల్స్, వీడియోస్ ఇతరులు వింటున్నట్లే కదా.. అందువల్ల తొందరపడి పర్సనల్ విషయాలు ఇతరులతో వాట్సాప్ ద్వారా షేర్ చేయకండి.. వీడియోలు సైతం అవసరమున్న వరకే పంపించుకోండి.. మరో ముఖ్యమైన విషయమేంటంటే కొన్ని వివాదాస్పద విషయాలను సైతం షేర్ చేయడం ద్వారా మీరు తప్పులో కాలేసినవాళ్లవుతారు

Written By:
  • Srinivas
  • , Updated On : May 23, 2023 / 10:53 AM IST
    Follow us on

    Whatsapp : నేటి కాలంలో మొబైల్ లేని చేతులు దాదాపుగా కనిపించవు. విద్యార్థుల నుంచి వృద్దుల వరకు మనుషులతో మాట్లాడడం మానేసి సెల్ తోనే కాలక్షేపం చేస్తున్నారు. వినోదంతో పాటు వ్యాపార వ్యవహారాలను నడిపేందుకు అనేక యాప్స్ మొబైల్ లో అందుబాటులో ఉండడంతో వాటితో ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. కానీ అన్నింటికంటే ఎక్కువగా యూజ్ చేసేది.. ప్రతీ ఒక్కరూ తప్పకుండా వాడే యాప్ వాట్సాప్. వాట్సాప్ లేని మొబైల్ బూతద్దం పెట్టి చూసినా దొరకదు. కమ్యూనికేషన్ తో పాటు ఫైల్స్ ను కూడా క్షణాల్లో సెండ్ చేసేందుకు ఉపయోగపడే ఈ యాప్ తో ఎన్నో లాభాలున్నాయి. అయితే అంతే స్థాయిలో నష్టాలు కూడా ఉన్నాయి. వాట్సాప్ యూజ్ చేసేటప్పుడు ఈ విషయాల్లో జాగ్రత్తలు పాటించకపోతే తీవ్రంగా నష్టపోతారని కొందరు సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.

    మనం వాట్సాప్ వాడేటప్పుడు ఎండ్ టు ఎండ్ స్క్రిప్ట్ ఎనేబుల్ చేసుకోవాలనే విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనిని ఆన్ చేసుకోవడం వల్ల మన చాట్స్ ను మూడో వ్యక్తి చూసే అవకాశం లేదని వాట్సాప్ యాజమాన్యం తెలుపుతున్నారు. దీంతో కొందరు విచ్చలవిడిగా తమ పర్సనల్ విషయాలను ఇతరులతో షేర్ చేసుకుంటున్నారు. కానీ కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ మెసేజ్ లు చూడొచ్చని కూడా తెలుసు. అయితే దానిని ప్రత్యేక అనుమతులు ఉంటాయి. కానీ ఇటీవల కొందరు మనం వాట్సాప్ ద్వారా చేసే వాయిస్ కాల్స్, వీడియో కాల్స్ ఇతరులు గ్రహిస్తున్నారని అంటున్నారు.

    ఉదాహరణకు వాట్సాప్ లో సినిమాల గురించి వీడియో కాల్ లో మాట్లాడుతాం.. లేదా రాజకీయాల గురించి చర్చిస్తాం.. ఇది అయిపోయిన తరువాత కాసేపటికి ఫేస్ బుక్ లేదా యూట్యూబ్ ఆన్ చేసి చూడండి.. మీరు మాట్లాడిన విషయాలకు దగ్గరి పోలిక ఉన్న వీడియోలు మీ ముందు ప్రత్యక్షమవుతాయి. అంటే మీరు ఓ విషయంపై చర్చించినప్పుడు దానికి రిలేటేడ్ గా ఉన్న వీడియోలు, మెసేజ్ లు ఎక్కువగా కనిపిస్తాయి.

    దీనిని భట్టి తెలుస్తుందేంటంటే.. మీరు వాట్సాప్ ద్వారా చేసే వాయిస్ కాల్స్, వీడియోస్ ఇతరులు వింటున్నట్లే కదా.. అందువల్ల తొందరపడి పర్సనల్ విషయాలు ఇతరులతో వాట్సాప్ ద్వారా షేర్ చేయకండి.. వీడియోలు సైతం అవసరమున్న వరకే పంపించుకోండి.. మరో ముఖ్యమైన విషయమేంటంటే కొన్ని వివాదాస్పద విషయాలను సైతం షేర్ చేయడం ద్వారా మీరు తప్పులో కాలేసినవాళ్లవుతారు.