WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్స్ లో ఒకటైన వాట్సాప్ ఈ మధ్య కాలంలో యూజర్లకు ప్రయోజనం చేకూరే విధంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. మనలో చాలామంది ఒక వాట్సాప్ అకౌంట్ ను రెండు వేర్వేరు మొబైల్స్ లో వాడి ఉంటే బాగుంటుందని చాలా సందర్భాల్లో అనుకొని ఉంటారు. ప్రస్తుతం రెండు మొబైల్స్ లో ఒకే వాట్సాప్ అకౌంట్ ను వాడుకునే అవకాశం లేకపోయినా రాబోయే రోజుల్లో మాత్రం ఒకే మొబైల్ లో రెండు వాట్సాప్ అకౌంట్లను సులభంగా వాడవచ్చు.

కొన్ని రోజుల క్రితం వాట్సాప్ మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ గురించి ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫీచర్ కు సంబంధించిన టెస్టింగ్ జరుగుతుండగా ఈ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత రెండు ఫోన్లలో వాట్సాప్ ను వాడుకునే ఫీచర్ అందుబాటులోకి రానుందని సమాచారం. వాట్సాప్ మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ కు అదనపు హంగులను జోడించాలని భావించి ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.
టెక్ నిపుణులు సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వివరాలను షేర్ చేస్తున్నారు. వాట్సాప్ అకౌంట్ ను గరిష్టంగా ఎన్ని మొబైల్స్ లో వాడవచ్చనే వివరాలు త్వరలో తెలిసే అవకాశం అయితే ఉంది. మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ ద్వారా ప్రస్తుతం ఒక అకౌంట్ ను ప్రస్తుతం ఒక మొబైల్ తో పాటు నాలుగు ఇతర డివైజ్ లలో వినియోగించే అవకాశం అయితే ఉంటుంది. ఇందుకోసం మెయిన్ మొబైల్ లాగిన్ అయిన తర్వాత ఇంటర్నెట్ కు కనెక్ట్ అయ్యి ఉండాల్సిన అవసరం లేదు.
మల్టీ డివైజ్ సపోర్ట్ ఫీచర్ కొరకు యూజర్లు ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఇతర డివైజ్ లలో మొబైల్ లేకపోవడంతో యూజర్లు నిరాశ పడినా ఆ జాబితాలో మొబైల్ ను కూడా యాడ్ చేస్తుండటంతో చాలామంది సంతోషిస్తున్నారు.