Love Story Box Office Collections: కూల్ హీరో నాగచైతన్య క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన ‘లవ్ స్టోరీ’ గత శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. ఇక ‘లవ్ స్టోరీ’ సినిమాకి బిజినెస్ బాగా జరిగింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ. 31.20 కోట్లకు అమ్ముడుపోయింది. దాంతో ఈ సినిమా రిలీజ్ కి ముందు ఏ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయో అని నిర్మాతలు టెన్షన్ పడ్డారు.

కానీ లవ్ స్టోరి కలెక్షన్స్ లో దూసుకుపోతుంది. ఫస్ట్ వీకెండ్ లో భారీ కలెక్షన్స్ ను రాబట్టిన ఈ సినిమా ప్రస్తుతం ఫుల్ లాభాల దిశగా సాగుతోంది. ఇప్పటికే యూఎస్ లో 1 మిలియన్ మార్క్ ను అందుకుంది. ఇక సెకండ్ వీకెండ్ లో ఈ సినిమా సాధించే కలెక్షన్స్ అన్ని ఇక లాభాలే.
మొత్తానికి ‘లవ్ స్టోరీ’ మూవీకి మొదటి వారాంతరం ప్రపంచవ్యాప్తంగా అందుకున్న షేర్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి.
ఏపీ మరియు తెలంగాణలో ఈ సినిమాకి మొత్తం ఇప్పటివరకు వచ్చిన కలెక్షన్స్ – 18.31 కోట్లు
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా – 01.78 కోట్లు
ఓవర్సీస్ లో వహ్సిన కలెక్షన్స్ – 04.70 కోట్లు
వరల్డ్ వైడ్ వచ్చిన కలెక్షన్స్ – 24.79 కోట్లు
ఈ రోజు కూడా చాలా చోట్ల హౌస్ ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ రోజు వస్తోన్న కలెక్షన్స్ ను బట్టి ఈ సినిమాకు మరో నాలుగు రోజుల వరకు ఎలాంటి ఇబ్బంది లేదు. పోటీలో మరో సినిమా లేకపోవడం, పైగా ఫ్యామిలీ ఆడియన్స్ కి నచ్చే అంశాలు సినిమాలో ఉండటం.. మొత్తానికి ఈ సినిమాకి బాగా కలిసి వచ్చింది. చైతు కెరీర్ లో ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచిపోతుంది.
ముఖ్యంగా సమాజంలో కనిపించే కుల, స్త్రీ వివక్ష సమస్యలే ప్రధానంగా ఈ సినిమాని శేఖర్ కమ్ముల ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం, ఈ సినిమా బాగా ప్లస్ అయింది. రెండూ సున్నితమైన అంశాల పై వచ్చిన ఈ సినిమా.. అందుకే సూపర్ హిట్ అయింది.