Kavya Maran: కావ్య మారన్.. ఐపీఎల్ చూసేవారికి ఈ పేరును ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.. వేలాది కోట్లకు ఒక్కతే అధిపతి. సన్ రైజర్స్ జట్టుకు కావ్య యజమానిగా కొనసాగుతున్నారు.. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు మాత్రమే కాకుండా.. దక్షిణాఫ్రికాలోని సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ పేరుతో ఈమెకు మరొక జట్టు కూడా ఉంది. ఇటీవల ఆ ప్రాంతంలో జరిగిన టీ -20 టోర్నీలో ఆమె జట్టు విజయం సాధించింది. అంతకుముందు సీజన్ లోనూ కప్ సాధించింది.. వాస్తవానికి సన్ గ్రూపులో ఉన్న కంపెనీలతో పోలిస్తే సన్ రైజర్స్ జట్టు చాలా చిన్నది. కానీ, ఎందుకనో తెలియదు సన్ రైజర్స్ మీద కావ్యకు అపారమైన ఇష్టం. ఆ జట్టులో ప్రతీది ఆమె పర్యవేక్షిస్తుంది. ఆటగాళ్ల కొనుగోలు నుంచి మైదానంలో ఆడే వరకు అన్ని విషయాలను కావ్యనే పట్టించుకుంటుంది. గత ఏడాది క్రీడాకారుల వేలం సమయంలో కమిన్స్ ను ₹20 కోట్లకు కొనుగోలు చేసినప్పుడు చాలామంది నవ్వారు.. ఈమెకేం తెలుసు అంటూ హేళన చేశారు. అయితే వారందరికీ తన జట్టు ఆట తీరుతోనే కావ్య సమాధానం చెప్పింది.. ఫిలిప్స్, మార్క్రం, క్లాసెన్, కమిన్స్ ను జట్టులోకి తీసుకున్నప్పుడు.. పేపర్ మీద బాగానే ఉంటుంది కానీ.. ఇది ఐపీఎల్ మ్యాచ్ లు గెలిచే జట్టేనా అంటూ చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేశారు.. అయితే వారందరికీ తన జట్టు ఆట తీరుతోనే కావ్య సమాధానం చెప్పింది.
మైదానంలో చలాకీగా ఉండే కావ్య.. చిన్నపిల్ల తనాన్ని ప్రదర్శిస్తుంది. జట్టు ఆటగాళ్లు ఆడితే ఎగిరి గంతేస్తుంది. ఓడిపోతే ముభావంగా ఉంటుంది. లండన్ లో ఎంబీఏ చదివిన కావ్య కు పెద్దగా స్నేహితులు లేరట. ఎప్పటికీ ఒంటరిగానే ఉంటుందట. గతంలో ఆమె సన్ గ్రూప్ సంస్థల్లో సన్ ఎఫ్ఎమ్, సన్ టీవీలో కొన్ని వ్యవహారాలు పర్యవేక్షించే వారట.. ఆమె నుంచి ఒంటరితనాన్ని దూరం చేసేందుకే కళానిధి మారన్, కావేరి మారన్ సన్ రైజర్స్ జట్టు విషయంలో పూర్తి స్వేచ్ఛ ఇచ్చారట. దక్షిణాఫ్రికాలో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు కొనుగోలు విషయంలోనూ అడ్డు చెప్పలేదట.
32 సంవత్సరాల వయసు వచ్చినప్పటికీ కావ్య ఎందుకు పెళ్లి చేసుకోలేదనే దానిపై ప్రత్యేకంగా కారణాలు లేవు. ఒక్కతే కూతురు కావడంతో కావ్య ఒంటరిగా ఉండేది. బహుశా దానివల్లే ఆమె పెద్దగా ఎవరితో కలవలేదు. అందువల్లే ఆమె ఒంటరిగా ఉంటుంది.. అప్పట్లో తమిళ సంగీత దర్శకుడు అనిరుద్ రవిచంద్రన్ తో ఆమెకు ఎఫైర్ ఉందని ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఢిల్లీ ఆటగాడు రిషబ్ పంత్ తో కూడా రిలేషన్ లో ఉందని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ నిరాధారమని తర్వాత తేలిపోయింది. ఒక వ్యాపారవేత్తతో ప్రేమలో ఉందని, అతడినే పెళ్లి చేసుకుంటుందని వార్తలు కూడా వినిపించాయి. అవి కూడా అవాస్తవాలని తేలిపోయాయి.
సన్ గ్రూప్ సంస్థల్లో సన్ రైజర్స్, సన్ మ్యూజిక్ బాధ్యతలు మాత్రమే ఆమె తల్లిదండ్రులు కావ్యకు అప్పగించారు. అవి కూడా ఆమెను ఒంటరితనం నుంచి దూరం చేస్తాయని భావించి మాత్రమే. ఇక ప్రస్తుతం కావ్యకు తన తండ్రి వ్యాపారాలను, సన్ రైజర్స్ జట్టును ఎలా ముందుకు తీసుకెళ్లాలనే ఆశయాలు మాత్రమే ఉన్నాయట.. ” కావ్య చాలా మంచిది. గొప్ప గుణం ఉంది. తల్లిదండ్రుల కంటే కూడా ఆమెది ఉదాత్తమైన స్వభావం. ఆమెపై వచ్చే పుకార్లు మొత్తం ఉత్తివేనని” ఓ నెటిజన్ పేర్కొనడం విశేషం.