Homeసైన్స్‌ అండ్‌ టెక్నాలజీWhat IS 3I ATLAS: సౌరవ్యవస్థలో కొత్త అతిథి – 3ఐ/అట్లాస్‌ వెనుక రహస్యం ఏమిటి?

What IS 3I ATLAS: సౌరవ్యవస్థలో కొత్త అతిథి – 3ఐ/అట్లాస్‌ వెనుక రహస్యం ఏమిటి?

What IS 3I ATLAS: అంతరిక్షం.. ఒక అనంతరం.. నిత్యం కోట్లాది ప్రక్రియలు.. చర్యలు.. ప్రతి చర్యలు జరుగుతుంటాయి. ఈ రహస్యాలను ఛేదించేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. పరిణామాలను నిత్యం శాస్త్రవేత్తలు గమనిస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఇటీవలి అంతరిక్ష పరిశీలనల్లో గుర్తించిన తెలియని స్పేస్‌ ఆబ్జెక్ట్‌ 3ఐ/లట్లాస్‌ ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసింది. దీని ఆకృతి పొడవుగా, మెరుపు లక్షణాలు ప్రత్యేకంగా ఉండటం శాస్త్రవేత్తలను ఊహల్లోకి నెట్టింది.

నాసా హెచ్చరికలు..
స్పానిష్‌ మీడియా నివేదికల ప్రకారం, 3ఐ/అట్లాస్‌ సౌరవ్యవస్థలోకి రావడం తర్వాత నాసా అంతర్గతంగా ‘ప్లానెటరీ డిఫెన్స్‌ ప్రోటోకాల్‌‘ను సచేతన చర్యగా అమలు చేసినట్టు సమాచారం. ఇది సాధారణంగా గ్రహశకలాల ఢీకొన్నప్పుడు మాత్రమే ఉపయోగించే వ్యవస్థ కావడం ఆసక్తిని మరింత పెంచింది. అయితే ఈ వస్తువు తేలికగా తిరుగడం లేదు, నియంత్రిత వేగంతో సరిగ్గా కదులుతోంది. గ్రహశకలాలకు సాధారణంగా కనబడే అసమాన చలనం ఇందులో కనిపించడం లేదు. దాని ఉపరితలం లోహపు ప్రతిఫలన చూపించడం మరో ఆసక్తికర అంశం. శాస్త్రజ్ఞులు కొందరు దీనిని సహజ ఖగోళ వస్తువుగా అంగీకరించలేకపోతున్నారు.

నాసా మౌనంతో ఉత్కంఠ
సూర్యుని పరిధికి చేరిన తర్వాత నాసా అధికారిక ప్రకటన ఇవ్వకపోవడం అనేక రకాల ఊహాగానాలకు తెరతీసింది. నాసా మౌనం కేవలం జాగ్రత్త చర్యనా లేక మరింత గోప్య పరిశీలనలో భాగమా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. 2017లో కనుగొన్న ‘ఒమువామువా’కి 3ఐ/అట్లాస్‌ స్ట్రైకింగ్‌తో పోలికలు ఉన్నాయి. రెండూ పొడవైన ఆకారంతో, నియంత్రిత గమనంతో, ప్రతిఫలించే ఉపరితలంతో కనిపించాయి. ఆ కాలంలో కూడా అన్య జీవుల సంకేతమని ఊహలు వెల్లువెత్తాయి.

భూమికి ముప్పు తప్పదా?
ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఇది భూమికి తక్షణ ప్రమాదం కాదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కానీ ఇది యాంత్రిక నిర్మాణమని తేలితే, మానవ నాగరికతకు అత్యంత విప్లవాత్మక శాస్త్రీయ నిజం కావచ్చు. 3ఐ/అట్లాస్‌ రహస్యం ఇంకా తిరుగులేని ప్రశ్నగానే మిగిలింది. ఇది సహజ ప్రకృతి కీర్తి ప్రతిరూపమా, లేక విశ్వవ్యాప్త జీవ సాక్ష్యమా అనే అంశం రాబోయే పరిశీలనల్లో తేలనుంది. కానీ ఒక విషయం స్పష్టంగా ఉంది.. ఈ సంఘటన మన విశ్వ అవగాహనకు కొత్త మైలురాయిగా నిలుస్తుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular