US ocean secrets: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా రోనాల్డ్ ట్రంప్ ఎన్నికయ్యాక.. ఆయన తీసుకుంటున్న ఇంత నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ట్రంపు నిర్ణయాలకు వ్యతిరేకంగా నిరసనలకు కూడా తెలుపుతున్నారు. ఓవైపు ట్రంప్ భయం వెంటాడుతుండగానే అమెరికా ప్రజలకు మరో భయం పట్టుకుంది. అమెరికా తీరప్రాంతాల్లో సముద్రం అడుగున నుంచి వెలువడుతున్న వింత కాంతులు, నీటిలోకి మాయమవుతున్న వింత వాహనాలు ఇప్పుడు తాజా చర్చాంశం అయ్యాయి. ప్రజాదరణ పొందిన “ఎనిగ్మా” యాప్ తాజాగా వేలకొద్దీ “అజ్ఞాత జల వస్తువుల” (యూ ఎస్ ఓ)లను గుర్తించింది. యాప్ చూపిన అబ్బురపరిచే సంఖ్యలు2022 చివర్లో ప్రారంభమైన ఎనిగ్మా ప్లాట్‌ఫార్మ్ గాలి మాత్రమే కాదు, నీరు, భూమి మూడు ప్రపంచాల రహస్యాలను గుర్తించగల డేటాబేస్‌గా నిలుస్తోంది. ఇప్పటి వరకు 30 వేలకు పైగా వింత వాహనాల సంభావ్య రికార్డులు సేకరించగా, వాటిలో 9 వేలకు పైగా సముద్రతీరాలలో చోటుచేసుకున్నట్లుగా డేటా వెల్లడిస్తోంది. వాటిలో 500 కేసులు ఐదు మైళ్ల పరిధిలో నమోదైనవిగా ఉన్నాయి.
“పచ్చ కాంతి” వీడియో వైరల్..
తాజాగా ఫ్లోరిడా తీరంలో మొబైల్ మేరా ద్వారా రికార్డ్ అయిన రెండు పచ్చ కాంతులు నీటిలో కదులుతున్న దృశ్యం తాజాగా వైరల్ అయింది. వీడియోలో ఊహకు అందని వేగంతో కాంతులు సాగే దృశ్యం శాస్త్రవేత్తలను కూడా ఆశ్చర్యానికి గురిచేసింది. పెంటగాన్ ధృవీకరించిన ఓమాహా సంఘటన 2019లో యూ ఎస్ ఎస్ ఓమాహా నౌక సముద్రం మీద తిరుగుతున్న గుర్తు తెలియని క్రాఫ్ట్ ను రికార్డు చేసింది. కొద్ది క్షణాల్లోనే ఆ వాహనం మునిగిపోయి మాయమైంది. ఈ వీడియోను అమెరికా రక్షణ శాఖ స్వయంగా ధృవీకరించింది. అంత వేగంతో, నీరు తాకకుండానే లోతుగా మాయం కావడం నావికాదళ అధికారులను ఆశ్చర్యపరిచింది.
నావికాదళ మాజీ రియర్ అడ్మిరల్ హెచ్చరిక
రిటైర్డ్ రియర్ అడ్మిరల్ టిమ్ గల్లాడెట్ తాజా ఘటనపై మాట్లాడుతూ ఈ ఘటనలన్ని అమెరికా సముద్ర భద్రతపై కొత్త సవాళ్లు తీసుకువస్తున్నాయని పేర్కొన్నారు. “గాలి నుంచి నీటిలోకి ఒక్క జలబిందువూ సృష్టించకుండా దూకగలిగే ఈ ఆబ్జెక్టులు మానవ సృష్టికన్నా వేరే విభాగానికి చెందినవి,” అని పేర్కొన్నారు. 2024లో సోల్ ఫౌండేషన్ కోసం ఆయన తయారు చేసిన 29 పేజీల పత్రంలో కూడా ఇలాంటి పునరావృత సంఘటనలు సైంటిఫిక్ రీతిలో నమోదై ఉన్నాయని తెలిపారు.
ప్రజల్లో పెరుగుతున్న భయం..
యూ ఎస్ ఓ పై తీవ్ర చర్చ జరుగుతున్నా, అమెరికా ప్రభుత్వ అధికారిక స్పందన లేదు. ప్రజలు మాత్రం “ప్రభుత్వం నిజాన్ని దాచుతోందా?” అనే సందేహం వ్యక్తం చేస్తున్నారు. సముద్రతీర ప్రాంతాల్లోని నివాసులు ఈ వింత కాంతులతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు.
ఏమిటీ కాంతులు..
కొంతమంది ఈ కాంతులను భూమి వాతావరణానికి వచ్చిన సాంకేతిక అద్భుతాలుగా భావిస్తుండగా, ఇంకొందరు రహస్య సైనిక పరికరాల ప్రయోగాలుగా అర్థం చేసుకుంటున్నారు. అయితే ఇప్పటివరకు దీనిపై తుది ఆధారాలతో కూడిన నిర్ధారణ ఏజెన్సీలకు అందలేదు. ఇప్పటి ఈ “సముద్ర మర్మం” చర్చ ఇక ఆగేలా కనిపించడం లేదు. గాలి నుంచి నీటిలోకి దూకే వాహనాలు — భవిష్యత్తు భౌతిక శాస్త్రాన్నే ప్రశ్నిస్తున్నాయి.
NY Post: “Thousands” of unidentified submerged objects (USOs) are lurking off America’s coastlines!
Here’s a group of USOs filmed off Ft. Lauderdale, FL: pic.twitter.com/5h6dXlJa0y
— Steven Greenstreet (@MiddleOfMayhem) October 28, 2025