Budget 5G Phones: రూ.15 వేల లోపు బెస్ట్ 5జీ ఫోన్లు ఇవే..

Budget 5G Phones: దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ టెల్కోలు ప్రస్తుతం నగరాల్లో తమ సేవలు అందుబాటులోకి తెచ్చాయి. దీంతో మరికొన్ని నగరాలకు కూడా విస్తరించనున్నాయి. 4జీ కంటే పది రెట్లు వేగంతో 5జీ సేవలు వినియోగంలోకి వచ్చాయి. దీంతో 5జీ ఫోన్లకు డిమాండ్ ఏర్పడుతోంది. చాలా మంది 5జీ ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం […]

Written By: Srinivas, Updated On : October 28, 2022 2:40 pm
Follow us on

Budget 5G Phones: దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా 5జీ సేవలు ప్రారంభమయ్యాయి. రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ టెల్కోలు ప్రస్తుతం నగరాల్లో తమ సేవలు అందుబాటులోకి తెచ్చాయి. దీంతో మరికొన్ని నగరాలకు కూడా విస్తరించనున్నాయి. 4జీ కంటే పది రెట్లు వేగంతో 5జీ సేవలు వినియోగంలోకి వచ్చాయి. దీంతో 5జీ ఫోన్లకు డిమాండ్ ఏర్పడుతోంది. చాలా మంది 5జీ ఫోన్లు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో 5జీ స్మార్ట్ ఫోన్ల ధరలు రూ. 15 వేల కంటే ఎక్కువగా ఉన్నాయి.

Budget 5G Phones

ఐక్యూ00 5జీ మొబైల్ అందుబాటులోకి వచ్చింది. కెమెరా నాణ్యతతోపాటు బ్యాటరీ, చార్జింగ్ వేగంతో ఉంటుంది. దీని ధర రూ. 13,999గా నిర్ణయించారు. దీంతో వీటిని కొనుగోలు చేసేందుకు వినియోగదారులు ముందుకు వస్తున్నారు. లావా బ్లెజ్ 5జీ ఫోన్లు కూడా మార్కెట్లోకి వచ్చాయి. 6.51 అంగుళాల హెచ్ డీప్లస్ ఐపీఎస్ డిస్ ప్లే కలిగి ఉండటంతో దీన్ని కొనుగోలు చేసేందుకు ఇంట్రస్ట్ చూపుతున్నారు. 5జీ స్మార్ట్ ఫన్లు గరిష్టంగా 2.2జీహెచ్ జడ్ బ్లాక్ స్పీడ్ తో 7ఎన్ఎం మీడియా టెక్ డైమెన్సిటీ 700 ఎస్వోసీ ద్వారా శక్తి పొందుతుంది.

సమ్ సంగ్ గెలాక్సీ ఎం13 5జీ ఫోన్ అందుబాటులోకి తీసుకొచ్చింది. అద్భుతమైన బ్యాటరీ, అందమైన కెమెరాతో ఈ ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. దీన్ని కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఎగబడుతున్నారు. దీని ధర రూ. 11,999గా నిర్ణయించారు. రెడ్ మీ కంపెనీ కూడా 5జీ ఫోన్ ను విడుదల చేసింది. ఇందులో కూడా అన్ని వెరైటీలు ఉన్నాయి. షావోమీ ఫోన్ ధర రూ. 14,999 గా ఉంది. దీంతో స్మార్ట్ 5జీ ఫోన్ల కోసం జనం ఎగబడుతున్నారు. డిజైన్, కెమెరా బాగుండటంతో ఆన్ లైన్ లో ఆర్డర్లు వస్తున్నాయి.

Budget 5G Phones

ప్రపంచం ఫోన్ల వినియోగంలో ఎంతో ముందుంటోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ ఫోన్ల వినియోగం పెరిగిపోయింది. ప్రస్తుతం 5జీ సేవలు రావడంతో ఇంకా అడ్వాన్స్ డ్ సాంకేతికతతో ముందుకు వెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇందులో భాగంగానే స్మార్ట్ ఫోన్ల వినియోగం రెట్టింపవుతోంది. భవిష్యత్ లో వీటి వినియోగం పెరిగి స్మార్ట్ ఫోన్ల డిమాండ్ ఎక్కువవుతోంది. వాటి కొనుగోలుకు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. ఫలితంగా 5జీ సేవలు ఇంకా విస్తృతం కానున్నాయి. దీంతో దేశంలో 5జీ సేవలు విస్తరించనున్నాయి.

Tags