Honey Badger: రాజ్యానికి అధిపతి రాజు.. అడవికి అధిపతి మృగరాజు సింహం.. వీరిపై దాడి చేయడానికి ఎవరూ సాహసం చేయరు. అడవిలోని మృగరాజులపై దాడి చేసే జంతువులు చాలా తక్కువే. భారీ శరీరాకృతి కలిగిని దున్నలు, ఏనుగులు సైతం తన కంటే చిన్నగా ఉన్న సింహాలను చూసి భయపడుతాయి. ఆ తరువాత పెద్దపులులు ఇతరు జంతువులను వణికిస్తాయి. కానీ ఇలాంటి జంతువులకే ముప్పు తిప్పలు పెట్టే ఓ జంతువు అడవిలో ఉందన్న విషయం చాలా మందికి తెలియదు. ఇది చూడ్డానికి ముంగిస వలె చిన్నగా ఉంటుంది. కానీ ఇది సింహాలను ఓ ఆట ఆడేసుకుంటుంది. అంతేకాకుండా ఇది ఇతర జంతువులకు చిక్కిప్రాణం పోతుందన్న దశలతో ఓ ట్రిక్ ద్వారా బయటపడుతుంది. అదేంటో తెలుసా? ఇంతకీ ఆ జంతువు పేరేంటి? ఆ వివరాల్లోకి వెళితే..
చాలా మందికి తేనే (Honey)అంటే చాలా ఇష్టం. కానీ ఎవరైనా అడవికి వెళ్లి తేనెను తీసుకురావడం అంటే సాహసమే అని చెప్పాలి. కానీ ఓ చిన్నపాటి జంతుందు హనీ బీట్స్ తో పోరాడి తేనెను సంపాదించుకుంటుంది. ఎందుకంటే ఈ జంతువుకు తేనే అంటే చాలా ఇష్టం. అందుకే ఆ జంతువు పేరు Honey Badger. ప్రపంచంలో అరుదైన జాతి అయిన హనీ బ్యాడ్జర్ తేనే ప్రియురాలు. ఇది తనకు కావాల్సిన ఆహారం కోసం ఎంతదూరమైనా ప్రయాణిస్తుంది. ఇవి నలుపు, తెలుపు రంగును కలిగి ఉంటాయి. హనీ బ్యాడ్జర్లు మొత్తం 12 రకాలుగా ఉన్నాయి. ఇవి వివిధ రంగులను కలిగి ఉంటాయి.
హనీ బ్యాడ్జర్ జంతువు మిగతా వాటికంటే ప్రత్యేకం అని చెప్పవచ్చు. దీని స్కిన్ లబ్బరి వలె సాగుతుంది. అందుకే దీనిని తినడానికి ఏ జంతువు పట్టుకున్నా వెంటనే తప్పించుకునే శక్తి వస్తుంది. అంతేకాకుండా ఇది సింహాలు సంపాదించుకున్న ఆహారాన్ని సైతం పోరాడి తెచ్చుకుంటుంది. సింహం దాడి చేసేందుకు ఎంత ప్రయత్నించినా.. చాకచక్యంగా తప్పించుకునే తెలివి దీని తగ్గర ఉంటుంది. వీటికి పదునైన దంతాలు ఉంటాయి. గోర్లు కూడా ఎక్కువగా ఉండడంతో ఇతర జంతువులపై దాడి చేయడానికి ఆస్కారం ఉంటుంది.
ఇక తన ఏదైనా జంతువుకు హనీ బ్యాడ్జర్ చిక్కి తన ప్రాణాలు పోతున్నాయని గ్రహిస్తే ఇది వెంటనే బ్యాడ్ స్మెల్ ను రిలీజ్ చేస్తుంది. ఇది రిలీజ్ చేసే స్మెల్ వల్ల అక్కడున్న జంతువుఒక్కసారిగా మూర్ఛపోయిన పనవుతుంది. దీంతో వెంటనే హనీ బ్యాడ్జర్ తప్పించుకుంటుంది. అడవిలో ఉండే పెద్ద పెద్ద జంతువులతో పాటు హైనా, ఆప్రికన్ జంతువులకు కూడా హనీ బ్యాడ్జర్ అంటే హడల్.
హనీ బ్యాడ్జర్లు ఎక్కువగా సౌత్ అరేబియాలో, ఆఫ్రికాతో పాటు ఇరాన్ దేశాల్లో కనిపిస్తాయి. అయితే 2022 జనవరిలో ఏపిలోని కడప జిల్లాలో దీనిని గుర్తించారు. ఒంటిమిట్ట మండలంలో హనీ బ్యాడ్జర్ ను గుర్తించినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. దీని దూకుడును చూసి కొందరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డుకు అప్లై చేయగా.. అందులో చోటు సంపాదించుకుంది. తెలివి, ధైర్యం విషయంలో ఏమాత్రం తగ్గేదేలే అన్నట్లు వ్యవహరిస్తుంది.