https://oktelugu.com/

TRAI: ఇకపై స్పామ్ కాల్స్ ఇబ్బంది ఉండదు.. ఈ కాల్స్ పై ట్రాయ్ కీలక నిర్ణయం

ఈ స్పామ్ కాల్స్‌పై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. రిజిస్టర్ కానీ టెలిమార్కెటర్స్ నుంచి అధికంగా కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు రావడంతో వాటిని నిలిపి వేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే రెండేళ్లపాటు వారి యాక్సెస్‌ను ఆపేస్తామని హెచ్చరించారు.

Written By:
  • Neelambaram
  • , Updated On : August 13, 2024 / 09:24 PM IST

    TRAI

    Follow us on

    TRAI: ఈరోజుల్లో ప్రతిఒక్కరూ స్మార్ట్‌ఫోన్స్ వాడుతున్నారు. వీటిని ఉపయోగించడం రానివాళ్లు కీప్యాడ్ మొబైల్స్ వాడుతున్నారు. ఏ మొబైల్ వాడిన స్పామ్ కాల్ సమస్య అయితే తప్పదు. రోజులో ఒక్కసారైన స్పామ్ కాల్ తప్పకుండా వస్తుంది. అప్పట్లో స్పామ్ కాల్స్ డిఫరెంట్ నంబర్లతో ఉండేవి. వీటిని ఈజీగా గుర్తించడం వల్ల కాల్ వచ్చిన వెంటనే మనకి అవసరం లేకపోతే కట్ చేసేవాళ్లం. కానీ ఇప్పుడు అలా కాదు. కామన్ నంబర్ల మాదిరిగానే వస్తున్నాయి. ఏదైనా పనిలో ఉన్న కొత్త నంబర్, ఎవరు కాల్ చేశారని పని ఆపేసి మరి లిఫ్ట్ చేస్తాం. తీరా లిఫ్ట్ చేసేసరికి అది స్పామ్ కాల్ అని తెలుస్తుంది. అయితే ఇలాంటి కాల్స్‌కు చెక్ పెట్టడానికి భారత టెలికాం నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. గుర్తింపు లేని వాటి నుంచి కంప్యూటర్ జెనరేటెడ్ లేదా రికార్డడ్, ప్రమెషన్స్ కాల్స్ వెంటనే ఆపేయాలని టెల్కోలకు టెలికాం సంస్థ ట్రాయ్ ఆదేశాలు జారీ చేసింది. వీటిని వెంటనే జారీ చేయాలని సూచించింది.

    ఈ స్పామ్ కాల్స్‌పై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు ఎక్కువగా వస్తున్నాయి. రిజిస్టర్ కానీ టెలిమార్కెటర్స్ నుంచి అధికంగా కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదు రావడంతో వాటిని నిలిపి వేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. అయితే ఎవరైనా ఈ నిబంధనలను ఉల్లంఘించినట్లయితే రెండేళ్లపాటు వారి యాక్సెస్‌ను ఆపేస్తామని హెచ్చరించారు. అలాగే రెండేళ్ల వరకు ఆ సంస్థను కూడా బ్లాక్ లిస్ట్‌లో పెడతారట. ఇలా చేయడం వల్ల సైబర్ నేరాలు తగ్గుతాయని భావిస్తున్నారు. ఎందుకంటే గుర్తింపు లేని స్పామ్ కాల్స్ వల్ల నేరాలు భారీగా పెరుగుతున్నట్లు ట్రాయ్ గుర్తించిందట. ఈ నిర్ణయం వల్ల ఇకపై నేరాలు తగ్గే అవకాశం ఉందని తెలిపింది.

    ఈ స్పామ్ కాల్స్‌పై ఫిర్యాదు చేయడానికి గతంలో ట్రాయ్ డీఎన్‌డీ 3.0 అనే యాప్‌ను తీసుకొచ్చింది. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ముందుగా కాంటాక్ట్స్, కాల్స్, మెసేజ్‌లకు అనుమతి ఇచ్చి లాగిన్ కావాలి. అందులో మీకు నచ్చిన డీఎన్‌డీ ఫ్రిఫరెన్సులను ఎంపిక చేసుకోవాలి. ఎడ్యుకేషన్, హెల్త్, బ్యాంకింగ్ ఇలా కేటగిరీలు ఉంటాయి. మీరు ఎంచుకున్న కేటగిరీ నుంచి మాత్రమే కాల్స్ వస్తాయి. అంతకు ముందు వచ్చి ఉంటే రిపోర్ట్ యూసీసీ అనే ఆఫ్షన్‌తో టెలికాం సర్వీసు ప్రొవైడర్‌కు ఫిర్యాదు చేయాలి. ఎస్పెమ్మెస్, వాయిస్‌లపై ఫిర్యాదు చేయాలంటే డైరెక్ట్‌గా ఓపెన్ చేస్తే హిస్టరీ కనిపిస్తుంది. దాని నుంచి కంప్లైంట్ ఇవ్వవచ్చు. గతంలోనూ ఈ యాప్‌ను తీసుకొచ్చారు. కానీ ఇందులో సమస్యలు ఉన్నాయని పెద్దగా దీనిని ఎవరూ ఉపయోగించలేదు. ప్రస్తుతం ఈ యాప్‌‌ను మెరుగుపర్చారు. అలాగే ఎప్పటిలాగే ప్రతినెలా ఒకటో తేదీ, 16వ తేదీన డేటాను సమర్పించాలని ట్రాయ్ టెల్కోలను ఆదేశించింది.