https://oktelugu.com/

Kriti Sanon: తమ్ముడు లాంటి కుర్రాడితో కృతి సనన్ డేటింగ్..ఘాటుగా స్పందించిన హాట్ బ్యూటీ!

'సోషల్ మీడియా లో ఈమధ్య కబీర్ బహియా అనే అబ్బాయితో నేను డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు మా ఇంట్లో వారు చూసి ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే కబీర్ నాకంటే పదేళ్లు చిన్నవాడు.

Written By:
  • Vicky
  • , Updated On : August 13, 2024 / 09:12 PM IST

    Kriti Sanon

    Follow us on

    Kriti Sanon: పాన్ ఇండియా లెవెల్ లో యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో కృతి సనన్ కచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది. అయితే ఈ హాట్ బ్యూటీ పై ఈమధ్య రూమర్స్ మాములు స్థాయిలో రావడం లేదు. గత ఏడాది మొత్తం ఈమె రెబెల్ స్టార్ ప్రభాస్ తో ప్రేమాయణం నడుపుతుందని, త్వరలోనే వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నారని, విదేశాల్లో నిశ్చితార్థం కూడా చేసేసుకున్నారు అంటూ వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై వెంటనే స్పందించిన కృతి సనన్ సోషల్ మీడియా లో అలాంటిదేమి లేదని , అసత్య ప్రచారాలను నమ్మొద్దు అంటూ ఖండించింది. ఇప్పుడు లేటెస్ట్ గా ఈమె యూకే కి చెందిన కబీర్ బహియా తో డేటింగ్ చేస్తున్నట్టుగా గత కొద్దిరోజులుగా సోషల్ మీడియా లో ఒక వార్త జోరుగా ప్రచారం సాగుతుంది. అయితే దీనిపై కృతి సనన్ చాలా ఎమోషనల్ గా స్పందించింది.

    ఆమె మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో ఈమధ్య కబీర్ బహియా అనే అబ్బాయితో నేను డేటింగ్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. ఈ వార్తలు మా ఇంట్లో వారు చూసి ఎంతో బాధపడ్డారు. ఎందుకంటే కబీర్ నాకంటే పదేళ్లు చిన్నవాడు. నాకు 34 సంవత్సరాల వయస్సు ఉంటే, అతనికి 24 సంవత్సరాలు ఉంటాయి. సోదరుడు లాంటి వ్యక్తితో ఇలాంటి సంబంధాలు కలుపుతూ కథనాలు ప్రచురించడం చాలా తప్పు. ఒకప్పుడు పత్రికలూ ఎంతో విలువలను పాటించేవి. కానీ ఈమధ్య సోషల్ మీడియా వచ్చిన తర్వాత రేటింగ్స్ కోసం ఇష్టమొచ్చిన కథనాలను ప్రచారం చేస్తున్నారు. మేము కూడా మనుషులమే, మాకు కూడా జీవితాలు ఉంటాయి. ఇలాంటి తప్పుడు ప్రచారాలు మీ ఇంట్లో వాళ్ళు చూసినప్పుడు ఎంత బాధపడుతారో, మా ఇంట్లో కూడా అంతే బాధపడుతారు. దయచేసి ఆలోచించండి’ అంటూ ఆమె ఎమోషనల్ గా ఒక పోస్టు పెట్టింది. దీనిపై ఆమె అభిమానులు పెద్ద ఎత్తున స్పందిస్తూ కృతి సనన్ కి మద్దతు తెలిపారు.

    ఇది ఇలా ఉండగా కృతి సనన్ ‘1 నేనొక్కడినే’ అనే చిత్రం ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైంది. ఆ సినిమా పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అయ్యినప్పటికీ కూడా కృతి సనన్ కి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చాయి. కానీ ఫ్లాప్ వస్తే ఏ హీరోయిన్ కి అయినా ఇండస్ట్రీ లో అవకాశాలు దక్కడం కష్టమే. కృతి సనన్ కి కూడా టాలీవుడ్ లో అదే జరిగింది. ఈ చిత్రం తర్వాత ఆమె తెలుగు లో నాగ చైతన్య తో కలిసి ‘దోచేయ్’ అనే చిత్రం చేసింది. ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు. దీంతో ఆమెకి బాలీవుడ్ లో అవకాశాలు వచ్చాయి. అక్కడ హిట్టు మీద హిట్టు కొడుతూ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. ఇప్పుడు ఆమె ‘మిమి’ చిత్రం లో అద్భుతంగా నటించినందుకు గాను నాషనలో అవార్డు కూడా దక్కించుకుంది. బాలీవుడ్ లో కృతి సనన్ అంటే ఒక బ్రాండ్ లాగ తనని తాను మార్చుకుంది.