Three Planets Alignment: ఆకాశం మనకు నిర్మలంగానే కనిపిస్తున్నప్పటికీ.. అందులో అనేక రకాల వింతలు నిత్యం చోటు చేసుకుంటూనే ఉంటాయి. అయితే ఈ వింతలు మన కంటికి కనిపించవు. కచ్చితంగా టెలిస్కోప్ లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం ఉన్న పరికరాల ద్వారా చూస్తేనే మనకు అది తెలుస్తుంది. ఖగోళ శాస్త్రవేత్తలు నిత్యం ప్రయోగాలు చేస్తూ ఉంటారు కాబట్టి ఆకాశంలో జరిగే అద్భుతాల గురించి మనకు తెలుస్తూ ఉంటుంది.
ఆకాశంలో నిత్యం జరిగే వింతల్లో ఈసారి అద్భుతం ఆవిష్కృతం కాబోతోంది. ఆకాశంలో ఒకేసారి మూడు గ్రహాలు కనువిందు చేయబోతున్నాయి. ఈ నెలలో వచ్చేవారం ఈ వింత చోటు చేసుకునే అవకాశం కనిపిస్తోంది. వచ్చేవారం 8, 9 తేదీలలో శుక్ర గ్రహం, బృహస్పతి అత్యంత దగ్గరికి వస్తాయి. ఈ రెండు గ్రహాల మధ్య దూరం ఉన్నప్పటికీ.. మనం భూమి నుంచి చూస్తాం కాబట్టి దగ్గరకు వచ్చినట్టుగా కనిపిస్తుంటాయి. ఈనెల 11న ఈ వింతలోకి బుధ గ్రహం కూడా చేరే అవకాశం ఉంది. బుధ గ్రహం చేరువగా వచ్చినప్పటికీ అది ఎక్కువసేపు కనిపించే అవకాశం ఉండకపోవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
భూమి నుంచి మనం చూస్తూ ఉండడం వల్ల ఆ గ్రహాలు దగ్గరికి వచ్చినట్టు కనిపిస్తుందని.. అది ఖగోళ వింత అని శాస్త్రవేత్తలు అంటున్నారు.. గ్రహాల మధ్య దూరం ఎక్కువగా ఉంటుంది. ఇవి ఒకేసారి దగ్గరికి రావడం అత్యంత అరుదు. గ్రహాలు దగ్గరగా వచ్చినప్పుడు రకరకాల పరిణామాలు చోటు చేసుకుంటూ ఉంటాయి. భూమి దగ్గరికి సూర్యుడి వచ్చినప్పుడు ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఎండాకాలంలో మనకు ఆస్థాయిలో వేడి కలగడానికి ప్రధాన కారణం సూర్యుడు భూమికి దగ్గరగా రావడమే. పైగా ఆ సమయంలో సూర్యుడి కిరణాలు భూమి మీద ఏటవాలుగా పడుతూ ఉంటాయి.
గతంతో పోల్చి చూస్తే ఇప్పటి కాలంలో ఖగోళ శాస్త్రం మీద ప్రయోగాలు చేయడం పెరిగింది. అన్ని దేశాలు అంతరిక్షం మీద ప్రధానంగా దృష్టి సారించాయి. ఉపగ్రహాలను పంపించడం.. అంతరిక్షంలో జరుగుతున్న పరిణామాలను అంచనా వేయడం.. చంద్రుడి మీద మానవ నివాస యోగ్యానికి అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయా.. అనే అంశం మీద ప్రయోగాలు చేయడం వంటివి ఇటీవల కాలంలో పెరిగిపోయాయి. అందువల్లే అంతరిక్షంలో జరుగుతున్న పరిణామాలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఈ మూడు గ్రహాలు దగ్గరికి రావడం వల్ల భూమికి పెద్దగా ప్రమాదం ఉండదని.. అది సాధారణంగా జరిగిపోయే ప్రక్రియ అని.. ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కాకపోతే ఈ వింతను చూసేందుకు అత్యంత ఖరీదైన పరికరాల వల్ల మాత్రమే సాధ్యమవుతుందని చెబుతున్నారు.
