Facebook Sensational Decision: ఫేస్ బుక్ అక్టోబరు 1న నైబర్‌హుడ్స్ అనే హైపర్‌లోకల్ ఫీచర్‌ను మూసివేయబోతోంది. ఈ ప్లాట్‌ఫారమ్ ప్రజలను వారి పొరుగువారితో కనెక్ట్ చేయడానికి ఫేస్ బుక్ ప్రవేశపెట్టింది. వారి ప్రాంతంలోని కొత్త ప్రదేశాలను కనుగొనడానికి.. స్థానిక సంఘంలో భాగమయ్యే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఇది మొదటిసారిగా 2022లో కెనడా, యుఎస్ వంటి దేశాలలో విడుదల చేయబడింది. ఈ సేవలో చేరడానికి.. ప్రత్యేక ప్రొఫైల్‌ను సృష్టించడానికి వినియోగదారులకు ఆప్షన్ ఇవ్వబడింది.

కానీ ఇది ఎప్పుడూ విస్తృతంగా జనంలో ఆదరణ పొందకపోవడం.. కంపెనీకి భారంగా మారడంతో దీన్ని ఆపుచేయాలని ఫేస్ బుక్ మాతృసంస్థ మెటా నిర్ణయించింది. నైబర్‌హుడ్‌లను మూసివేయాలనే నిర్ణయం కంపెనీకి పెద్ద దెబ్బగా పలువురు పేర్కొంటున్నారు.
మెటా ఈ నిర్ణయానికి స్పష్టమైన సమాధానం లేదా కారణాన్ని ఇవ్వలేదు. అయితే కంపెనీ ఇటీవలి ఖర్చులను తగ్గించడంపై దృష్టి సారించడంతో ఇలా అర్ధాంతరంగా ఈ సేవలనుంచి వైదొలుగుతోంది. అలాగే నైబర్‌హుడ్‌లను మూసివేయడం వల్ల వినియోగదారులు లేదా కంపెనీ షేర్‌హోల్డర్‌ల నుండి భారీ ఎదురుదెబ్బలు తగులుతాయని భావిస్తోంది.
నైబర్‌హుడ్‌లను ప్రారంభించినప్పుడు స్థానిక కమ్యూనిటీలను ఒక దగ్గరికి తీసుకురావడమే లక్ష్యమని అనుకుంది. గ్రూప్‌ల ద్వారా దీన్ని చేయడానికి ఉత్తమమైన మార్గం అని ఫేస్ బుక్ భావించింది. ఇది ప్రాథమికంగా డిజిటల్ డైరెక్టరీగా భావించారు.
ఈ నైబర్ హుడ్ అనుకున్నంత హిట్ కాకపోవడంతో అక్టోబర్ 1 నుంచి ఈ సేవ అందుబాటులో ఉండదని.. దీన్ని ఆపివేస్తున్నట్టు కంపెనీ ప్రకటించింది.