https://oktelugu.com/

Screenless Laptops : త్వరలో స్క్రీన్ లేని ల్యాప్ టాప్ లు.. ఫీచర్లు చూస్తే మతి పోవాల్సిందే

NEET Question Paper : ముందుగా బుక్ చేసుకోవాలి. అమెరికాలో అక్టోబర్ నుంచి ఈ ల్యాప్ టాప్ ల డెలివరీ మొదలవుతుంది.

Written By:
  • NARESH
  • , Updated On : June 16, 2024 / 09:54 PM IST

    Screenless Laptops

    Follow us on

    Screenless Laptops : టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది. కొత్త కొత్త సాంకేతికత మనిషి జీవితాన్ని మరింత సుఖవంతం చేస్తోంది. ఇందులో భాగంగానే వినూత్నమైన ఆవిష్కరణలు మార్కెట్లో సందడి చేస్తున్నాయి. ఇప్పుడు ఈ కోవలోకే వస్తోంది స్క్రీన్ లేని ల్యాప్ టాప్. వాస్తవానికి ల్యాప్ టాప్ అనేది టెక్నాలజీ సృష్టించిన అద్భుతం. అలాంటి ల్యాప్ టాప్ స్క్రీన్ లేకుండా వస్తోంది అంటేనే ఆశ్చర్యం కలుగుతోంది. అయితే త్వరలోనే స్క్రీన్ లేని ల్యాప్ టాప్ లు బాటులోకి వస్తాయట.

    వాస్తవానికి స్మార్ట్ ఫోన్ లు లేదా ల్యాప్ టాప్ లు స్క్రీన్ ఆధారంగా పనిచేస్తాయి. ఈ స్క్రీన్ లేకుంటే వాటితో ఎటువంటి ఉపయోగం ఉండదు. సాధారణంగా వీటి ద్వారా చేసే పనికి సంబంధించి అవుట్ పుట్ ను మనం స్క్రీన్ లోనే చూసుకోవచ్చు. అలాంటిది ల్యాప్ టాప్ కు స్క్రీన్ ఉండదనే ఊహ కళ్ళ ముందు కదలాడుతుంటేనే ఆశ్చర్యంగా అనిపిస్తోంది. అయితే సైట్ ఫుల్ అనే కంపెనీ మూడు సంవత్సరాల పాటు విపరీతంగా కష్టపడి.. స్క్రీన్ లేకుండా పనిచేసే ల్యాప్ టాప్ ను రూపొందించింది.. 100 అంగుళాల వర్చువల్ డిస్ ప్లే ను ప్రదర్శించే క్రమంలో.. ప్రపంచంలోనే మొట్టమొదటిగా ఏఆర్ ల్యాప్ టాప్ ను సిద్ధం చేసింది. దీనికి స్పేచ్ టాప్ జీ -1 అనే పేరు పెట్టింది. దీనికి 100 అంగుళాల వర్చువల్ స్క్రీన్ లభిస్తుంది. క్రోమ్ ఆపరేటింగ్ సిస్టం ద్వారా పనిచేస్తుంది. 16 జిబి ర్యామ్, 128 జీబీ డేటా స్టోరేజ్ సామర్ధ్యాన్ని ఇది కలిగి ఉంటుంది. కనెక్టివిటీ కోసం ఈ ల్యాప్ టాప్ లో రెండు యు.ఎస్.బి టైప్ సీ పోర్ట్ లు ఉన్నాయి. Wi-Fi 7, 5G( నానో సిమ్, ఇ – సిమ్ సపోర్ట్) బ్లూ టూత్ వెర్షన్ 5.3 కి సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్ టాప్ లో 60Wh బ్యాటరీ ఉంటుంది. ఒకసారి దీనిని చార్జ్ చేస్తే ఎనిమిది గంటలపాటు వాడుకునేందుకు అవకాశం ఉంటుంది.

    ఇక ఈ ల్యాప్ టాప్ ఏ ఆర్ టెక్నాలజీతో పని చేస్తుంది. దీని ధరను కంపెనీ 174 గా నిర్ణయించింది. భారత కరెన్సీ లో రూ. 1,42,035 లభిస్తుంది.. రిటైల్ మార్కెట్లో దీని ధర 1900 డాలర్లుగా ఉంటుదట. భారత కరెన్సీ ప్రకారం దీని ధర 1,58,745 గా ఉంటుందట. దీనిని సొంతం చేసుకోవాలంటే, ముందుగా బుక్ చేసుకోవాలి. అమెరికాలో అక్టోబర్ నుంచి ఈ ల్యాప్ టాప్ ల డెలివరీ మొదలవుతుంది.