https://oktelugu.com/

Puri Laddoos : పూరీలతో లడ్డూలు ఎప్పుడైనా చేశారా? సూపర్ గా ఉంటాయి.

Puri Laddoos డయాబెటీస్ ఉన్న వారు మాత్రం ఈ లడ్డూలకు దూరంగా ఉండాలి. వీటిలో చక్కెరను అధికంగా వినియోగిస్తారు. కాబట్టి మీరు వీటిని తినకపోవడమే బెటర్.

Written By:
  • NARESH
  • , Updated On : June 16, 2024 10:00 pm
    Ever made laddoos with puris?

    Ever made laddoos with puris?

    Follow us on

    Puri Laddoos : పూరీలు ఇష్టంగా చేసుకున్నా కొన్ని సార్లు తినలేక మిగిలిపోతుంటాయి. మరి మిగిలిన పూరీలు తర్వాత గట్టిగా అయితే తినాలి అనిపించదు కదా. మరి ఆ పూరీలను ఏం చేస్తున్నారు. పారేస్తున్నారా? వెయిట్ వెయిట్ ఒక్కసారి ఆ పూరీలతో ఇలా రెసీపీలు చేసుకోండి సూపర్ గా ఉంటాయి. అది కూడా స్వీట్. మరి పూరీలతో లడ్డూలను ఎలా తయారు చేసుకోవాలో కూడా ఓ సారి చూసేయండి.

    పూరీ లడ్డుకు కావలసినవి..

    పూరీలు – పది, నెయ్యి – రెండు కప్పులు, యాలకులు పొడి – ఒక స్పూను, జీడిపప్పు – గుప్పెడు, చక్కెర – మూడు కప్పులు,

    తయారు చేసుకోవాల్సిన విధానం..

    ముందుగానే గోధుమ పిండితో పూరీలను చేసుకొని రెడీగా ఉంచుకోండి. కొందరు మైదాతో చేస్తారు. కానీ ఈ పూరీలు మంచివి కావని తెలుసుకోండి. ఇక గోధుమ పిండితో పూరీలను కాస్త క్రిస్పీగా వచ్చేలా చేసుకోండి. ఈ పూరీలను చేత్తోనే నలిపి పొడిలా చేసుకోండి. లేదా ఒకసారి మిక్సీలో వేసుకున్నా సరిపోతుంది. ఓ మిక్సీలో పంచదారను కూడా వేసి పొడి చేసుకోండి. స్టవ్ మీద పెద్ద కళాడి పెట్టి నెయ్యి వేసుకోండి. అందులో కొన్ని జీడిపప్పులను వేయించి తీసి పక్కన పెట్టుకొండి.

    అదే కడాయిలో పూరీ పొడి, పంచదార పొడి వేసి బాగా కలుపుకోండి. ఇందులో కాస్త యాలకుల పొడిని చల్లుకోవాలి. ఈ మొత్తం మిశ్రమం దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకోండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాస్త చల్లారనివ్వండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లడ్డూల్లా చుట్టుకొండి. అంతే టేస్టీ పూరీ లడ్డు రెడీ. ఈ లడ్డూలు నాలుగైదు రోజులపాటు తాజాగా ఉంటాయి. పిల్లలకు కూడా వీటిని ఇష్టంగా తింటారు. నార్మల్ లడ్డూల కంటే కూడా ఈ లడ్డూలు బాగుంటాయి. మరి ఓ సారి ట్రై చేసి చూడండి.

    డయాబెటీస్ ఉన్న వారు మాత్రం ఈ లడ్డూలకు దూరంగా ఉండాలి. వీటిలో చక్కెరను అధికంగా వినియోగిస్తారు. కాబట్టి మీరు వీటిని తినకపోవడమే బెటర్. ఇక పిల్లలకు కూడా రోజుకు ఒకటి ఇవ్వండి. ఏదైనా తీపి పదార్థం తినాలనిపించినప్పుడు వీటిని తింటే చాలా బాగుంటాయి.