Homeవార్త విశ్లేషణLook back science and technology 2024: AI మరింత దూసుకొచ్చింది.. Quantum computing సరికొత్తగా...

Look back science and technology 2024: AI మరింత దూసుకొచ్చింది.. Quantum computing సరికొత్తగా మారింది.. ఈ ఏడాది టెక్నాలజీ లో మార్పులు ఇవే..

Look back science and technology 2024: Artificial intelligence దుమ్మురేపింది. Quantum computing సరి కొత్తగా మారింది.. ఇవే కాక ఇంకా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలు అందుబాటులోకి వచ్చాయి. మరికొన్ని కొత్త రూపు దాల్చుకున్నాయి. మొత్తంగా చూస్తే ఈ ఏడాది సైన్స్ అండ్ టెక్నాలజీ అందుకున్న ఘనతలు.. సృష్టించిన చరిత్రలు అన్నీ ఇన్నీ కావు.

1.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్

ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్, మిషన్ లెర్నింగ్ ట్రాన్స్ఫార్మెటివ్ టెక్నాలజీ, ఆటోమేషన్, ప్రిడిక్టివ్ అనలిటిక్స్, నాచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ వంటివి కంప్యూటర్ విజన్ పూర్వ గతిని పూర్తిగా మార్చేశాయి. వర్చువల్ అసిస్టెంట్, రికమండేషన్ సిస్టం నుంచి అటానమస్ వెహికల్స్, ప్రిడిక్టివ్ మెయింటెనెన్స్ వరకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్ విస్తరించింది. సరికొత్త ఆవిష్కరణలకు దారితీసింది. చివరికి జిమ్ మిషన్లు కూడా ఆర్టిఫిషల్ ఇంటెలిజెన్స్ తో నడుస్తున్నాయి. వాషింగ్ మిషన్లు కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారానే పనిచేస్తున్నాయి.

2.బ్లాక్ చైన్ టెక్నాలజీ

బ్లాక్ చైన్ టెక్నాలజీ, బిట్ కాయిన్, ఇథిరియం వంటివి క్రిప్టో కరెన్సీ కి వెన్నెముకగా మారాయి. సురక్షితమైన సమాచార మార్పిడి, డిజిటల్ గుర్తింపు, ట్రాకింగ్ వంటి వాటిని బ్లాక్ చైన్ టెక్నాలజీ అందిస్తోంది. సంస్థలకు మెరుగైన భద్రత, నమ్మకమైన విస్తరణ ను బ్లాక్ చైన్ ద్వారా పొందే అవకాశం ఉంది.

3.ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (IoT)

ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ సెన్సార్ల శ్రేణిని పరస్పరం అనుసంధినిస్తోంది. రియల్ టైం సమాచార సేకరణ, విశ్లేషణ, నియంత్రణను కొనసాగిస్తోంది. స్మార్ట్ హోం, కనెక్ట్ చేసిన ఇండస్ట్రీల నుంచి ఖచ్చితమైన సమాచారాన్ని విశదీకరిస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత స్మార్ట్ గా మార్చేందుకు ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపకరిస్తోంది.

4.సైబర్ సెక్యూరిటీ

పెరుగుతున్న సైబర్ వేధింపులు, ఆన్లైన్ లో జరుగుతున్న దాడులతో యూజర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు. వీటిని నివారించేందుకు సైబర్ సెక్యూరిటీలో సరికొత్త ఎన్ క్రిప్సన్, నైతిక హ్యాకింగ్ వంటివి తెరపైకి వచ్చాయి. డిజిటల్ అసెట్స్ సెక్యూరిటీ, సెన్సిటివ్ డేటా ప్రొటెక్షన్ వంటివి సరికొత్త రూపు దాల్చాయి.

5.క్వాంటం కంప్యూటింగ్

క్వాంటం కంప్యూటర్ ద్వారా క్రిఫ్టోగ్రఫీ, ఆప్టిమైజేషన్ వంటి వాటి ద్వారా విప్లవాత్మకమైన అభివృద్ధిని సాధించింది.. భవిష్యత్తు కాలంలో ఎదుర్కొనబోయే సవాళ్లను పరిష్కరించేందుకు సరికొత్తగా అభివృద్ధి చెందుతోంది.

6.అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ

అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వంటివి భౌతిక, డిజిటల్ ప్రపంచాల మధ్య దూరాలను దగ్గర చేస్తున్నాయి. గేమింగ్, వినోదం, శిక్షణ, విద్య, రిమోటింగ్ ట్రాన్స్పరెంట్, వర్చువల్ ప్రోటో టైపింగ్, ఆర్కిటెక్చరల్ విజువలైజేషన్, మెడికల్ సిముమిలేషన్, స్టోరీ టెల్లింగ్ వంటి వాటిల్లో అగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ సరికొత్త ఆవిష్కరణలకు దారితీస్తున్నాయి.

7.ఎడ్జ్ కంప్యూటింగ్

ఎడ్జ్ కంప్యూటింగ్ గణన, డేటా స్టోరేజ్, డేటా సోర్స్ లో సరికొత్త మార్పులను తీసుకొచ్చింది. రియల్ టైం ప్రాసెసింగ్, లో టైమ్ కమ్యూనికేషన్, బ్యాండ్ విత్ ఆప్టిమైజేషన్, డేటా ప్రాసెసింగ్, ఎడ్జ్ కంప్యుటింగ్ స్కేలబిలిటీ వంటి వాటిలో సరికొత్త మార్పులకు నాంది పలికింది.

8. 5జి టెక్నాలజీ

అత్యాధునిక టెక్నాలజీ వేగం, బ్యాండ్ విడ్త్, తక్కువ జాప్యం, హై ఎండ్ కనెక్టివిటీ ని 5జి అందించింది. ఆరోగ్య సంరక్షణ నుంచి మొదలు పెడితే రవాణా రంగం వరకు 5జి సరికొత్త మార్పులకు శ్రీకారం చుట్టింది.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version