Bank Loans: ప్రస్తుత కాలంలో డబ్బు అవసరం తీవ్రంగా ఉంటుంది. ఆదాయానికి మించి ఖర్చులు పెరగడంతో కొన్ని అవసరాల కోసం అప్పులు చేయాల్సి వస్తుంది. అయితే ఈ అప్పులను బ్యాంకులు తక్కువ వడ్డీకే ఇవ్వడంతో చాలామంది బ్యాంకులను ఆశ్రయిస్తున్నారు. బ్యాంకులన్నీ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో పనిచేస్తాయి. ఒక్కోసారి రెపో రేట్లు పెంచడం వల్ల బ్యాంకులు వడ్డీ రేట్లు పెంచుతాయి. దీంతో లోన్ తీసుకోవడం కష్టంగా మారుతుంది. తాజాగా కొన్ని బ్యాంకులు వడ్డీ రేట్లు తగ్గించాయి. అయితే వడ్డీ రేట్లు తగ్గించడానికి వేరే కారణం ఉంది. అదేంటంటే?
పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా అనే రెండు బ్యాంకులు ఒరిజినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్ లెండింగ్ రేట్స్ (MCLR )ను తగ్గించాయి. MCLR అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రవేశపెట్టిన ఒక పద్ధతి. దీని ద్వారా బ్యాంకులు సొంతంగా వడ్డీరేట్లు నిర్వహిస్తాయి. ఆర్బిఐ తో సంబంధం లేకుండా వడ్డీరేట్లు మారుస్తూ ఉంటాయి. బ్యాంకులకు ఏర్పడిన నిధుల వ్యయం, నిర్వాహ ఖర్చులు, లాభాల మార్జిన్ ను పరిగణలోకి తీసుకొని వట్టి రేట్లు పెంచవచ్చు.. తగ్గించవచ్చు.. 2016లో దీనిని ప్రవేశపెట్టారు. దీంతో కొన్ని బ్యాంకులు వినియోగదారులను ఆకర్షించేందుకు ఒక్కోసారి వడ్డీ రేట్లు తగ్గించే అవకాశం కూడా ఉంటుంది. ఫలితంగా వినియోగదారుల సంఖ్యను పెంచుకోవడం.. బ్యాంకుల పారదర్శకతను తీసుకురావడం వంటివి చేస్తాయి. కొన్ని బ్యాంకులు MCLR ద్వారా వడ్డీ మార్పులు చేసి వినియోగదారులను ఆకర్షిస్తాయి.
తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ అన్ని రకాల రుణాలపై MCLR nu 15 బేసిస్ పాయింట్స్ మేరా తగ్గించింది. బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం అన్ని రకాల టెన్యూర్స్ పై ఐదు నుంచి 15 వరకు బేసిస్ పాయింట్స్ తగ్గించింది. మిగతా బ్యాంకుల పోటీ నుంచి తట్టుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు బ్యాంకులు MCLR బేసిస్ పాయింట్స్ తగ్గించడం వల్ల రుణాలు తీసుకున్న వారికి ఉపయోగకరంగా మారింది. ఇప్పటికే లోన్ తీసుకున్న వారికి కొంతవరకు మాఫీ అయ్యే అవకాశం ఉంటుంది.
అయితే ఈ రెండు బ్యాంకుల నిర్ణయం వల్ల మిగతా బ్యాంకులు MCLR ను తగ్గిస్తాయా? లేదా? చూడాలి. ఒకవేళ ఇలాంటి నిర్ణయం తీసుకోకపోతే ఒత్తిడి పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే కొన్ని బ్యాంకులు వినియోగదారులను ఆకర్షించేందుకు ఆర్బిఐ రూల్స్ ప్రకారం వడ్డీరేట్లు తగ్గించే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే మూడుసార్లు ఆర్బిఐ బేసిస్ పాయింట్లను తగ్గించింది. నీతో కొన్ని బ్యాంకులకు అనుకూలంగా మారింది. అయితే తాజాగా పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో MCLR ద్వారా బేసిస్ పాయింట్లను తగ్గించడంతో వినియోగదారుల చూపు ఇటువైపు మళ్ళినట్లు తెలుస్తోంది.