Robot Suicide: పని ఒత్తిడితో సూసైడ్‌ చేసుకున్న రోబో.. ఎక్కడ జరిగిందో తెలుసా?

సౌత్‌ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్‌లో పనిచేస్తున్న సివిల్‌ సర్వెంటుగా రోబో పనిచేస్తుంది. ఇటీవల ’రోబో సూపర్వైజర్‌’గా పిలువబడే రోబోట్‌ కౌన్సిల్‌ భవనంలోని మొదటి, రెండవ అంతస్తుల మధ్య ఉండే మెట్ల మీద నుంచి కిందపడిపోయింది.

Written By: Raj Shekar, Updated On : July 6, 2024 9:20 am

Robot Suicide

Follow us on

Robot Suicide: మనకు పని ఎక్కువైనా… మనం సొంతంగా పని చేస్తున్నా ఎప్పుడో ఒకప్పుడు మానసిక ఒత్తిడి కారణంగా డిప్రెషన్‌లోకి వెళ్తాం. కొందరు ఈ డిప్రెషన్‌ను అధిగమిస్తారు. ఇంకొందరు దానికి తలొగ్గి ఆత్మహత్య చేసుకుంటారు. ఇది మనుషులకే సాధ్యం. కానీ పని ఒత్తిడి భరించలేక తాజాగా ఓ రోబోట్‌ కూడా ఆత్మహత్య చేసుకుంది. రోబోలు కూడా ఒత్తిడి భరించలేక ఆత్మహత్య చేసుకుంటాయని ఇటీవలే గుర్తించారు.

ఎక్కడ జరిగిందంటే..
సౌత్‌ కొరియాలోని గుమి సిటీ కౌన్సిల్‌లో పనిచేస్తున్న సివిల్‌ సర్వెంటుగా రోబో పనిచేస్తుంది. ఇటీవల ’రోబో సూపర్వైజర్‌’గా పిలువబడే రోబోట్‌ కౌన్సిల్‌ భవనంలోని మొదటి, రెండవ అంతస్తుల మధ్య ఉండే మెట్ల మీద నుంచి కిందపడిపోయింది. దీనిని మొట్టమొదటి ‘రోబోట్‌ ఆత్మహత్య‘గా చెబుతున్నారు.
సిటీ కౌన్సిల్‌ అధికారులు వెంటనే స్పందించారు. పగిలిన రోబోట్‌ ముక్కలను విశ్లేషణ కోసం సేకరించారు. మరోవైపు రోబో ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమిటనే దిశగా దర్యాప్తు చేస్తున్నారు.

పని ఒత్తిడి కారణంగా..
ఈ రోబోలు ఎక్కువ సమయంలో పని చేయడం వల్ల ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని చాలా మంది అనుకుంటున్నారు. రోబోట్‌ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు విచిత్రంగా ప్రవర్తించినట్లు, అక్కడే ఏదో వెతుకుతున్నట్లు ఇటూ అటూ తిరుగుతూ కనిపించిందని అక్కడ పనిచేసే ఉద్యోగులు పేర్కొన్నట్లు సమాచారం. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు రోబో పనిచేస్తుంది. ఇలా విరామం లేకుండా పనిచేయడం వల్లనే రోబో ఆలా ప్రవర్తించిందని, ఆత్మహత్య చేసుకుందని పలువురు భావిస్తున్నారు.

సౌత్‌ కొరియాలో వినియోగం..
ప్రపంచ దేశాలతో పోలిస్తే.. సౌత్‌ కొరియాలో రోబోట్స్‌ వినియోగం చాలా ఎక్కువ. ప్రతి పది మంది ఉద్యోగులకు సహాయం చేయడానికి ఒక రోబోట్‌ ఉంటుందని ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ రోబోటిక్స్‌ వెల్లడించింది. కాగా రోబో నిజంగా ఆత్మహత్య చేసుకుందా? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనేది తెలియాల్సి ఉంది.