Singapore: సింగపూర్‌లో రక్తదాన శిబిరం

సింగపూర్‌ తెలుగు సమాజం ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏటా నిర్వహిస్తుందని శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన శిబిరానికి భారతీయ మూలాలు ఉన్న అందరూ హాజరు కావడం విశేషమని పేర్కొన్నారు.

Written By: Raj Shekar, Updated On : July 6, 2024 9:08 am

Singapore

Follow us on

Singapore: శ్రీసత్యసాయి గ్లోబల్‌ ఆర్గనైజేషన్‌ సింగపూర్, శ్రీసెంపగ వినాయగర్‌ టెంపుల్, సింగపూర్‌ సిలోన్‌ తమిళ్‌ అసోసియేషన్, మునీశ్వరన్‌ కమ్యూనిటీ సర్వీసెస్‌ సంయుక్తంగా సింగపూర్‌లో రక్తదాన శిబిరం నిర్వహించాయి. ఈ కార్యక్రమానికి తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాష మాట్లాడే స్థానిక ప్రజలు హాజరయ్యారు. 120 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. దాతలను సింగపూర్‌ తెలుసు సమాజం అధ్యక్షుడు బొమ్మారెడ్డి శ్రీనివాసులురెడ్డి అభినందించారు. రక్తదానం గురించి అందరూ అవగాహన పెంచుకోవాలని కోరారు.

ఏటా రక్తదాన శిబిరాలు..
సింగపూర్‌ తెలుగు సమాజం ఇలాంటి రక్తదాన శిబిరాలు ఏటా నిర్వహిస్తుందని శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఈ ఏడాది నిర్వహించిన శిబిరానికి భారతీయ మూలాలు ఉన్న అందరూ హాజరు కావడం విశేషమని పేర్కొన్నారు. కోవిడ్‌ సమయంలో 9 సార్లు రక్తదాన శిబిరాలు నిర్వహించి తెలుగు సమాజం రికార్డు సృష్టించిందని పాలెపు మల్లిక్‌ గుర్తుచేశారు.

కార్యక్రమం విజయవంతం..
ఈ రక్తదాన శిబిరానికి సింగరూర్‌లోని తెలుగు వారు వైదా మహేశ్, రాపేటి జనార్దనరావు, జ్యోతీశ్వర్‌రెడ్డి సమన్వయ కర్తలుగా వ్యవహరించారు. ఇందులో పాల్గొన్న దాతలు, పరిశీలకులు, సేవాదళం సభ్యులకు సింగపూర్‌ తెలుగు సమాజం ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి అనిల్‌కుమార్‌ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. అందరి సమష్టి కృషితో కార్యక్రమం విజయవంతమైందని తెలిపారు.