Telecom: గడిచిన దశాబ్దా కాలంగా సైబర్ మోసాలు(Cyber cheetings) క్రమంగా పెరుగుతున్నాయి. మోసాలను అరికట్టేందుకు సాంకేతికతను అభివృద్ధి చేస్తున్నారు. అయితే అదే సాంకేతికతలోని లోపాలను మోసగాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. కొత్త కొత్త విధానాల్లో మోసాలకు పాల్పడుతున్నారు. ఇటీవల ఫేక్ కాల్స్‌తో మన వివరాలను తెలుసుకుని బ్యాంకు ఖాతాల్లోని నగదు తస్కరిస్తున్నారు. ఫేక్ మేస్సేజ్‌లతో బోల్తా కొట్టిస్తున్నారు. చదువు రానివారి నుంచి ఉన్నత చదువులు చదివినవారు కూడా మోసాలబారిన పడుతున్నారు. ఈ నేపథ్యంలో టెలికాం శాఖ కొత్త మొబైల్ యాప్(Mobile aap)ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఫేక్ కాల్స్, మెస్సేజ్‌లకు చెక్ పెట్టవచ్చని పేర్కొంటోంది. ఈ యాప్‌ను కేంద్ర టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా శుక్రవారం(జనవరి 17న) ఆవిష్కరించారు.
ఎలా పనిచేస్తుందంటే..
మన ఫోన్‌కు అనుమానిత కాల్స్ వచ్చినప్పుడు మొబైల్ ఫోన్ లాగ్ నుంచే నేరుగా ఫిర్యాదు చేయడం, మొబైల్ ఫోన్ బ్లాక్ వంటి సదుపాయాలతో ఈ కొత్త యాప్ సంచార్ సాధీని అందుబాటులోకి తెచ్చింది. తొలుత సంచార్ సాథీ పోర్టల్‌ను 2023లో కేంద్ర టెలికాం శాఖ అందుబాటులోకి తెచ్చింది. మొబైల్ యాప్‌ను లాంచ్ చేయడం ద్వారా మరింత సమర్థంగా మోసాలకు చెక్ పెట్టొచ్చని కేంద్రం భావిస్తోంది. ఆండ్రాయిడ్ ఐఓఎస్ ఈ యాప్ వినియోగించవచ్చు.
సంచార్ సాథీ ఫీచర్లు ఇవే..
– అనుమానిత నంబర్ల నుంచి కాల్స్, మెస్సేజ్‌లు వచ్చినప్పుడు కాల్ లాగ్ నుంచే నేరుగా ఫిర్యాదు చేయవచ్చు.
– మీ పేరిట ఉన్న ఎన్ని మొబైల్ కనెక్షన్లు ఉన్నాయో తెలుసుకోవచ్చు. మీ పేరు మీద అనధికారికంగా ఏవైనా నంబర్లు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు.
– ఫోన్ పోయినప్పుడు, దొంగతనానికి గురైనప్పుడు బ్లాక్ చేసే సదుపాయం ఉంటుంది.
– మొబైల్ ఫోన్ ప్రామాణికతను కూడా ఈ యాప్ సాయంతో గుర్తించొచ్చు. ఇందుకోసం ఐఎంఈఐ నంబర్ ఎంటర్ చేయాలి. సెకండ్ హ్యాండ్ మొబైల్ కొనుగోలు చేసేటప్పుడు ఈ ఫీచర్ ఎంతగానో ఉపయోగపడుతుంది.
రక్షణకు కొన్ని చిట్కాలు..
1. నో రస్పాన్స్: మీరు గుర్తు తెలియని నంబర్ నుంచి కాల్ వస్తే, మీరు ప్రత్యక్షంగా స్పందించకండి. అనవసరమైన కాల్స్‌ను కన్సిడర్ చేయకుండా వదిలేయండి.
2. నంబర్‌ను నిరోధించు: ఎవరైనా ఫేక్ కాల్స్ చేసినా, దాన్ని నిరోధించడానికి మీరు మీ ఫోన్‌లోనూ కంట్రోల్ కలిగి ఉంటారు.