Anil Ravipudi and Shankar : ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న విషయం మనకు తెలిసిందే. మరి ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది దర్శకులు కూడా వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది… ఇప్పటికే కొంతమంది కమర్షియల్ డైరెక్టర్లు వరుస సక్సెస్ లను సాధిస్తూ ముందుకు సాగుతూ ఉండడం విశేషం…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న దర్శకుడు అనిల్ రావిపూడి (Anil Ravipudi)… ప్రస్తుతం ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాతో మంచి విజయాన్ని సాధించి తనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా ఈ సినిమాతో భారీ రికార్డులను క్రియేట్ చేస్తూ మంచి వసూళ్లను కూడా సంపాదిస్తున్నాడు. మరి ఏది ఏమైనా దిల్ రాజు(Dil Raju) ఈ సినిమాతో సంక్రాంతి పండుగ విన్నర్ గా నిలవడమే కాకుండా భారీ కలెక్షన్స్ ని కూడా కొల్లగొడుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే అనిల్ రావిపూడి లాంటి డైరెక్టర్ శంకర్ లాంటి స్టార్ డైరెక్టర్ సైతం షాక్ ఇచ్చి ‘సంక్రాంతి వస్తున్నాం’ (Sankranthiki Vastunnam) సినిమాతో అతని సినిమాను పక్కకు నెట్టి సూపర్ సక్సెస్ ని అందుకొని స్టార్ డైరెక్టర్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు.
మరి ఈ క్రమంలోనే ఆయన ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా శంకర్ కి షాక్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. 2014 వ సంవత్సరంలో అనిల్ రావిపూడి తీసిన పటాస్ సినిమాని సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొద్దాం అనుకున్నప్పటికి శంకర్ ఐ సినిమాని సంక్రాంతికి తీసుకు వస్తున్నాడు అని తెలిసి పెద్ద సినిమాలతో పోటీ ఎందుకని ఆగిపోయారట.
ఇక ఐ సినిమా పెద్దగా టాక్ తెచ్చుకోకపోవడంతో అది రిలీజ్ అయిన వారం రోజుల గ్యాప్ లోనే ఈ సినిమాని రిలీజ్ చేయమని దిల్ రాజు చెప్పడంతో పటాస్ సినిమాని రిలీజ్ చేసి సూపర్ సక్సెస్ ని అందుకున్నారు. ఇక అప్పుడు కూడా పటాస్ తో అనిల్ రావిపూడి శంకర్ కి షాక్ ఇచ్చాడు. ఇప్పుడు మరోసారి అదే ఆనవాయితీని కంటిన్యూ చేశాడు. ఇక ఇప్పుడు సంక్రాంతికి శంకర్ ‘గేమ్ చేంజర్’ సినిమాని తీసుకురాగా అతనికి షాకిస్తూ అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం సినిమాను తీసుకురావడం ఆ మూవీ సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడం అన్ని చకచక జరిగిపోయాయి.
ఇక మొత్తానికైతే గేమ్ చేంజర్ సినిమా దిల్ రాజుకు నష్టాలు మిగిలిస్తే సంక్రాంతి వస్తున్నాం సినిమాతో ఆ లాసులను కవర్ చేసుకుంటున్నాడు అంటూ కొంతమంది ట్రేడ్ పండితులు సైతం వాళ్ల అభిప్రాయాల్ని తెలియజేస్తూ ఉండడం విశేషం…ఇక అనిల్ తన తదుపరి సినిమాని చిరంజీవితో చేయబోతున్నాడనే విషయం మనకు తెలిసిందే. ఇక ఇప్పటికే ఆ సినిమాకు సంబంధించిన కథ మొత్తాన్ని రెడీ చేసి పెట్టుకున్నాడు తొందర్లోనే ఆ సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్ళే ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టుగా తెలుస్తోంది…