Homeజాతీయ వార్తలుParliament Budget Session 2025: బడ్జెట్‌కు వేళాయె.. రెండు విడతల్లో పార్లమెంట్‌ సమావేశాలు.. తేదీలు ఇవే..

Parliament Budget Session 2025: బడ్జెట్‌కు వేళాయె.. రెండు విడతల్లో పార్లమెంట్‌ సమావేశాలు.. తేదీలు ఇవే..

Parliament Budget Session 2025: బడ్జెట్‌ అనేది ఒక వ్యయం, ఆదాయం, ఖర్చులను నియంత్రించడానికి లేదా నిర్వహించడానికి రూపొందించిన ఆర్థిక ప్రణాళిక. ఇది వ్యక్తిగత, కుటుంబ, కంపెనీ లేదా ప్రభుత్వ స్థాయిలో కూడా ఉండవచ్చు. బడ్జెట్‌ ద్వారా మనం నిర్దిష్టమైన కాలపరిమితిలో ఏ విధంగా డబ్బు గడించాలో, ఖర్చు చేయాలో, పొదుపు చేయాలో నిర్ణయిస్తాం. దేశ ఆదాయ వ్యయాలు, పెట్టుబడులు, పొదుపు తదితర అంశాలకు సంబంధించి కేంద్రం ఏటా బడ్జెట్‌ ప్రవేశపెడుతుంది. పార్లమెంట్‌ ఆమోదం మేరుకు ధరల పెంపు, తగ్గుదల, పన్నుల విధింపు, ఉపశమనం వంటి అంశాలను ఇందులో పొందుపరుస్తుంది. 2025–26 సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను పార్లమెంటు(Parlament)లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. గతంలో మార్చిలో బడ్జెట్‌ ప్రవేశపెట్టేవారు. మోదీ ప్రధాని అయిన నాటి నుంచి ఫిబ్రవరి 1న బడ్జెట్‌ పెడుతున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి అమలులోకి వస్తోంది.

తేదీలు ఖరారు..
2025–26 వార్షిక బడ్జెట్‌కు సంబంధించిన పార్లమెంటు సమావేశాలను నిర్వహించే తేదీలను కేంద్రం ఖరారు చేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత సమావేశాలు నిర్వహిస్తారు. మార్చి 10 నుంచి ఏప్రిల్‌ 4 వరకు రెండో విడత సమావేశాలు జరుగుతాయి. జనవరి 31న రాష్ట్రపతి(Prasident) ప్రసంగంతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఫిబ్రవరి 1న కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌(Nirmala seetaraman) పార్లమెంట్‌లో ప్రవేశపెడతారు.

ఢిల్లీ ఊసెత్తకుండా…
ఇక ఈ బడ్జెట్‌ సమావేశాల్లో ఢిల్లీకి సంబంధించిన ఊసు ఉండదు. ఫిబ్రవరి 5న అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఢిల్లీ(Delhi) కేంద్రంగా ఎలాంటి ప్రకటనలు చేయకూడాదని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ పేరు కూడా ఎత్తే అవకాశం లేదు. ఇక ఈ ఏడాది చివరలో బిహార్‌ ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో ఈ బడ్జెట్‌తో బిహార్‌కు వరాలు ఉంటాయని బీజేపీ మిత్ర పక్షాలు జేడీయూ, లోక్‌ జనశక్తి(రామ్‌ విలాస్‌) పార్టీలు ఆశిస్తున్నాయి.

వేతన జీవులకు శుభవార్త..
ఇక బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్న వేతన జీవులకు ఈసారి శుభవార్త ఉంటుందన్న వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇన్‌కమ్‌ట్యాక్స్‌(Income Tax) పరిమితి పరిధిని కూడా కేంద్రం పెంచుతుందన్న కథనాలు వస్తున్నాయి. ప్రస్తుతం రూ.7 లక్షలుగా ఉన్న ఆదాయ పరిమితిని రూ.9 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular